ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA GANDHI: తెలంగాణలో టీడీపీ నాశనానికి రేవంత్‏రెడ్డే కారణం.. ఆయనకు నన్ను విమర్శించే అర్హత లేదు..

ABN, First Publish Date - 2023-11-28T11:00:43+05:30

శేరిలింగంపల్లి రోడ్‌షోలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలను బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ(MLA Arekapudi Gandhi)

- కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

- ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సవాల్‌

మియాపూర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లి రోడ్‌షోలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలను బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ(MLA Arekapudi Gandhi) ఖండించారు. పార్టీ మారి టీడీపీకి ద్రోహం చేశానన్న రేవంత్‌రెడ్డి వాఖ్యలపై గాంధీ స్పందించారు. నాలుగు పార్టీలు మారిన రేవంత్‌రెడ్డి తనను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. నేను ఏ పరిస్థితుల్లో పార్టీ మారానో చంద్రబాబు నాయుడుకి, ప్రజలకు తెలుసన్నారు.

తెలంగాణలో టీడీపీ నాశనం కావడానికి కారణం రేవంత్‌రెడ్డి కాదా.. అని ప్రశ్నించారు. ఆయన నాపై చేసినవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, రేవంత్‌రెడ్డి భాగోతం దేశం అంతా కళ్లారా టీవీలో చూసిందన్నారు. తనను విమర్శించే నైతిక అర్హత రేవంత్‌రెడ్డికి లేదన్నారు. తన నిబద్ధతకు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం, చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు మొన్నటి వరకూ తన సహచరుడిగా ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థే సాక్ష్యమని గాంధీ గుర్తు చేశారు. నాపై చేసిన కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నిరూపించలేకపోతే రేవంత్‌రెడ్డి రాజకీయ సన్యాసానికి సిద్ధమా అని గాంధీ సవాల్‌ విసిరారు. గోపన్‌పల్లిలో సర్వే నెంబర్‌ 127లో నీవు చేసిన కబ్జా బాగోతం ప్రజలందరికీ తెలుసు.. కావాలంటే నేను నిరూపిస్తాను అని ఘాటుగా విమర్శించారు. కబ్జా బాగోతం నిరూపించడానికి ఏ వేదిక అయినా సిద్ధమని, అసత్య ఆరోపణలు చేస్తే సహించబోనని గాంధీ హెచ్చరించారు.

Updated Date - 2023-11-28T11:00:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising