ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Muthireddy Yadagirireddy: కేసీఆర్‌కు నువ్వు సలహాలు ఇచ్చేవాడివా?.. పల్లాపై ముత్తిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-08-24T16:37:38+05:30

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై జనగామ ఎమ్మల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సిద్దిపేట: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై (MLC Palla Rajeshwarreddy) జనగామ ఎమ్మల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagirireddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం కొమురవెల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమం, కేసులు అంటే తెలవని వాళ్లు టిక్కెట్ కావాలంటూ ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆస్తుల్ని అమ్మి తాము తెలంగాణ కోసం పని చేస్తే, కార్పొరేట్ శక్తులు, సీఎం దగ్గర ఉంటానని చెప్పుకునే కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ‘‘నేను చెబితేనే ముఖ్యమంత్రి పని చేస్తున్నారు, నేను చెబుతేనే వీఆర్‌ఏలను రెగ్యులర్ చేశారని, నేనే 50 లక్షల సభ్యుత్వాలు చేశానని ప్రగల్బాలు పలుకుతున్నారు పల్లా. ఓ ఆడబిడ్డ ఆస్తిని కబ్జా చేసిన చరిత్ర నిది. రాష్ట్రం, దేశం మెచ్చిన మేధావి కేసీఆర్ కు నువ్వు సలహాలు ఇచ్చేవాడివా?. కేసీఆర్ సారథ్యంలో మేము పని చేస్తున్నామని మంత్రులు, మా పార్టీ నేతలు, హరీష్ రావు లాంటి వారు చెబితే నువ్వు మాత్రం అంతా నీ ఘనతగా చెబుతావా. పల్లా మాటలు మా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కళంకం. జనగామలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదు, ఒక్కనాడు ప్రజల్లోకి రాడు, అలాంటి వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారా?. జనగామ అభివృద్ధిలో పొగడ్తలు అందుకుంటూ ఉంటే, అభివృద్ధి కాలేదనడం అవివేకం. ముఖ్యమంత్రి ఇంకా టిక్కెట్ ప్రకటించకుండానే తనకు కేటాయించినట్లు ఎలా చెబుతారు..? నీ చెవిలో సెప్పారా’’ అంటూ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-08-24T16:37:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising