MLA Raghunandan Rao : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
ABN, First Publish Date - 2023-07-05T13:01:05+05:30
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గజ్వేల్‌కు బయలుదేరిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. గజ్వేల్‌లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణల్లో బాధిత హిందూ యువకులను పరామర్శించడానికి వెళుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యే రఘునందన్ రావును అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గజ్వేల్‌కు బయలుదేరిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. గజ్వేల్‌లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణల్లో బాధిత హిందూ యువకులను పరామర్శించడానికి వెళుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యే రఘునందన్ రావును అరెస్ట్ చేశారు.
శివాజీ విగ్రహం ఎదుట ఓ వ్యక్తి మద్యం మత్తులో మూత్ర విసర్జన చేయడంతో గజ్వేల్ పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది. మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ముస్లిం కావడంతో అది గమనించిన హైందవ సోదరులు, శివాజీ విగ్రహం కమిటీ అయిన భగత్ యూత్ ఆధ్వర్యంలో సదరు వ్యక్తిని పట్టుకుని పోలీ్‌సస్టేషన్‌లో అప్పగించారు. అనంతరం సీఐకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని కోరారు. పోలీ్‌సస్టేషన్ నుంచి శివాజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహించి తిరిగి వస్తున్న క్రమంలో ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించగా, మధు అనే వ్యక్తి పోలీ్‌సస్టేషన్ వైపుగా వెళ్లగా, సందీప్ అనే యువకుడి తలపై బాదం మిల్క్ సీసాతో దాడిచేశారు. ఈ ఘటనలో సందీప్ తలకు గాయమవగా, హైందవులంతా కలిసి అంబేడ్కర్ చౌరస్తా వద్దకు చేరుకుని ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
సోమవారం రాత్రి వరకూ ఆందోళన కొనసాగడంతో సిద్దిపేట సీపీ శ్వేత ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి, మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చారు. ఇక మంగళవారం ఉదయం నుంచే పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైందవ సంఘాలన్నీ కలిపి శివాజీ విగ్రహం నుంచి ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో మార్కెట్ రోడ్డులోని మదీనా మసీదు వద్దకు చేరుకోగానే ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో పలువురు మసీదు పైకి జెండాలను విసరగా, మరికొందరు రాళ్లు రువ్వారు. గజ్వేల్ ఏసీపీ రమేశ్ అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేయగా, మసీదులోని ముస్లింలు నినాదాలు చేయడంతో మరోసారి రాళ్లు రువ్వారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను ఇందిరాపార్కు చౌరస్తా వైపునకు మళ్లించారు. అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో గంటపాటు ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో మసీదు వద్ద ముస్లింలు ఆందోళనకు దిగారు. సీపీ శ్వేత ఇరుపక్షాలను సముదాయించారు.
Updated Date - 2023-07-05T13:06:03+05:30 IST