MLA Sitakka: నోడౌట్.. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..
ABN, First Publish Date - 2023-09-09T13:09:10+05:30
తెలంగాణలో త్వరలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ములుగు ఎమ్మెల్యే సీతక్క(Mulugu MLA Sitakka) ధీమా వ్యక్తం
మంగపేట(ములుగు): తెలంగాణలో త్వరలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ములుగు ఎమ్మెల్యే సీతక్క(Mulugu MLA Sitakka) ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం, మంగపేట, గంపోనిగూడెం గ్రామాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైల జయరామిరెడ్డి ఆధ్వర్యంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. కోమటిపల్లి(Komatipalli) క్రాస్‌రోడ్‌లో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించి, మాట్లాడారు. బీఆర్‌ఎస్(BRS)పై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని, బీజేపీపై నమ్మకంలేదని, అందరు కాంగ్రెస్‌కే ఈసారి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం కమలాపురం గుడ్డేలుగులపల్లి కాలనీలో సీతక్క పర్యటించగా, మహిళలు సాదరంగా బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి సుమారు 50 మంది సీతక్క చేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలకు ఆకర్శితులై, కాంగ్రెస్‌లో చేరారు. మంగపేటలో టీవీ హిదయతుల్లా ఆధ్వర్యంలో పలువురు చేరారు. వారందరికీ సీతక్క కండువాలను మెడలో వేసి, స్వాగతం పలికారు. కార్యక్రమాలలో జాతీయ మిర్చి టాస్క్‌ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వల్లెపల్లి శివప్రసాద్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పూజారి సురేందర్‌బాబు, యూత్ కాంగ్రెస్ ములుగు నియోజికవర్గ ఇన్‌చార్జి ఇస్సార్‌ఖాన్, జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య పాల్గొన్నారు.
పార్టీలో భారీగా చేరికలు..
ఏటూరునాగారం: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచి, అధికారంలోకి రావడం ఖాయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. రొయ్యూర్, శంకరాజుపల్లి, కేకే గూడెంనకు చెందిన పలువురు కాంగ్రెస్‌లోకి రాగా, ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు 200 మంది ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గృహలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్ధిదారులను స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద అర్హులను గుర్తించాలన్నారు. బ్లాక్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మెనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అయూబ్‌ఖాన్, మండల అధ్యక్షుడు చిటమట రఘు, కాంగ్రెస్ నాయకులు ఎమ్డీ ఖలీల్, ముక్కెర లాలయ్య, గుండ్ల దేవేందర్, చెన్నూరి బాలరాజు, వావిలాల చిన్నఎల్లయ్య, కట్కూరి రాధిక, కర్ల అరుణ పాల్గొన్నారు.
Updated Date - 2023-09-09T13:09:12+05:30 IST