MLA: కాంగ్రెస్‌కే గ్యారంటీ లేదు.. ప్రజలకేం గ్యారంటీ ఇస్తారు..
ABN, First Publish Date - 2023-10-20T09:24:31+05:30
కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదు.. ప్రజలకేం గ్యారంటీ ఇస్తారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(MLA Manchireddy Kishanreddy
- నూటికి నూరు శాతం మళ్లీ బీఆర్ఎస్దే అధికారం
హయత్‌నగర్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదు.. ప్రజలకేం గ్యారంటీ ఇస్తారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(MLA Manchireddy Kishanreddy) ఎద్దేవ చేశారు. గురువారం తుర్కయంజాల్‌లోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ బూత్ సాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బడ్జెట్లో 40శాతం నిధులు ప్రజా సంక్షేమానికే ముఖ్యమంత్రి ఖర్చు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు పోతుందన్నారు. పేదల కష్ట సుఖాలు తెలుసుకునే నాయకుడు మనకు ఉన్నాడని అన్నారు. రాష్ట్రంలో నూటికి నూరు శాతం మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మెస్థితిలో లేరని అన్నారు. నియోజకవర్గం పరిశీలకులు తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ పొద్దు ఎరగని కొత్త బిచ్చగాడిలా కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని వారి ఉచ్చులో పడవద్దని కోరారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు వేముల అమరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-20T09:24:31+05:30 IST