ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మైనంపల్లి రాజీనామాతో బీఆర్‌ఎస్‌కు దెబ్బే!

ABN, First Publish Date - 2023-09-24T03:53:52+05:30

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేయడంతో ఆ పార్టీకి గట్టి షాక్‌ తగిలిందనే చెప్పవచ్చు.

మల్కాజిగిరి’లో కొత్త సమీకరణలు

4అసెంబ్లీ సెగ్మెంట్లపై ప్రభావం

ఎమ్మెల్యే బాటలోనే పలువురు

అల్వాల్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేయడంతో ఆ పార్టీకి గట్టి షాక్‌ తగిలిందనే చెప్పవచ్చు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన మైనంపల్లి దాదాపు 74 వేల మెజార్టీతో సమీప బీజేపీ ప్రత్యర్థిపై ఘనం విజయం సాధించారు. ప్రజలకు, క్యాడర్‌కు అండగా ఉంటూ ముందుకు పోయే నేతగా మైనంపల్లికి పేరు ఉంది. బీఆర్‌ఎ్‌సకు దూరమైన ఆయన ఇంకా ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని స్పష్టం చేయలేదు. అయితే కాంగ్రెస్‌ తరఫున తన కుమారుడు రోహిత్‌కు మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, ఆయన కుత్బుల్లాపూర్‌ లేదా మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి సీటు కోసం ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయమైన సమాచారం. ఏదేమైనప్పటికీ ఆయన ముఖ్య అనుచరులతో చర్చించిన తరువాతనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మైనంపల్లికి మల్కాజిగిరి నియోజకవర్గంలోనే కాకుండా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌ నియోజకవర్గాలతో పాటు మెదక్‌ జిల్లాలోనూ ఆయనకు బలమైన క్యాడర్‌ ఉంది. ఆయన బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేయడంతో ఆయా నియోజకవర్గాలపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మల్కాజిగిరిలోని ఇద్దరు కార్పొరేటర్లుతో పాటు అల్వాల్‌ సర్కిల్‌లో ఒక డివిజన్‌కు చెందిన మైనంపల్లి ముఖ్య అనుచరుడు బీఆర్‌ఎ్‌సను వీడే అవకాశం ఉందని అనుకుంటున్నారు.


ఆ వ్యాఖ్యల తర్వాత నిధుల నిలిపివేత!

ఎమ్మెల్యే మైనంపల్లి.. పార్టీ సీనియర్‌ నేత, మంత్రి హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తరువాత మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి నిధుల విడుదల ఆగిపోయింది. సీఎం రీలి్‌ఫఫండ్‌తో పాటు బీసీ బంధు, అభివృద్ధికి సంబంధించిన నిధులను ఆపేశారు. తాజాగా జీహెచ్‌ఎంసీకి చెందిన ఒక డీఈతో పాటు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో నేరేడ్‌మెట్‌ ఎస్‌హెచ్‌వో, ఏసీపీని బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ అధికారులతో మైనంపల్లికి సత్సంబంధాలు ఉండడం వల్లే బదిలీ వేటు పడిందని అనుకుంటున్నారు.

మర్రి రాజశేఖర్‌రెడ్డికి టికెట్‌ ఖరారు!

మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిని శుక్రవారం సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌కు పిలుపించుకుని మాట్లాడారని విశ్వసనీయ సమాచారం. దాదాపుగా ఆయనకే మల్కాజిగిరి నుంచి టికెట్‌ ఇవ్వాలని అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు, కార్పొరేటర్‌ శాంతిశ్రీనివా్‌సరెడ్డి కూడా ఇప్పటికే మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ను కలిసి ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం కల్పించాలని కోరారు. అయితే మహిళా కోటాలో ఆమెకు టికెట్‌ ఇచ్చే విషయమై పార్టీలో చర్చించినట్లు సమాచారం.

Updated Date - 2023-09-24T08:55:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising