తెలంగాణ సాధనలో గద్దర్‌ పాత్ర అమోఘం

ABN , First Publish Date - 2023-08-23T00:04:17+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజా యుద్ధ నౌ క గద్దర్‌ పాత్ర అమోఘమని సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అన్నారు. మంగళవారం భువనగిరి శివారులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో టీజీఏ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, సీనియర్‌ అడ్వకేట్‌ రావి సురేందర్‌రెడ్డి అధ్యక్షతన గద్దర్‌ సంతాప సభ నిర్వహించారు.

తెలంగాణ సాధనలో గద్దర్‌ పాత్ర అమోఘం

సంతాప సభలో సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, గాదె ఇన్నయ్య

భువనగిరి రూరల్‌, ఆగస్టు 22 : తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజా యుద్ధ నౌ క గద్దర్‌ పాత్ర అమోఘమని సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అన్నారు. మంగళవారం భువనగిరి శివారులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో టీజీఏ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, సీనియర్‌ అడ్వకేట్‌ రావి సురేందర్‌రెడ్డి అధ్యక్షతన గద్దర్‌ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో గద్దర్‌ ఆటా పాటా మూగబోవడం ఈ ప్రాంత ప్రజలను ఎంతగానో బాధించిందన్నారు. సీమాంధ్ర వలస పాలకుల దోపిడీపోయి ప్రజలందరికీ న్యా యం జరగాలని గద్దర్‌ ఆకాంక్షించాడన్నారు. అతడి చివరి శ్వాస విడిచే వరకూ పేద ల పక్షాన నిలిచాడని గుర్తుచేశారు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన పోరాట పటిమ ఆక్సిజన్‌ లాంటిదన్నారు. గద్దర్‌తో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రజాకవి రాజనర్సింహ మాట్లాడుతూ గద్దర్‌ నైపుణ్యం గొప్పదని తన జానపద పాటల ద్వారా పాడి అందరినీ ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అఽధ్యక్షుడు నాగారం ఆంజయ్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు బట్టు రాంచంద్రయ్య, భువనగిరి శ్రీనివా్‌సనేత, ఎస్‌ మల్లారెడ్డి, డి బాలనర్సయ్య, మిత్‌ పాషా, చిలుకమారి గణేష్‌, పోచయ్య, శ్రీనివాసాచార్యులు, బెల్లి చంద్రశేఖర్‌, జయ పాల్గొన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-08-23T00:04:17+05:30 IST