ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Jagdish Reddy: ఆ విషయంలో దిక్కుతోచని పరిస్థితిలో ప్రతిపక్షాలు

ABN, First Publish Date - 2023-08-23T14:59:00+05:30

బీఆర్ఎస్(BRS) ముందే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్ష నాయకులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని మంత్రి జగదీష్‌రెడ్డి(Minister Jagdish Reddy) అన్నారు.

సూర్యాపేట: బీఆర్ఎస్(BRS) ముందే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్ష నాయకులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని మంత్రి జగదీష్‌రెడ్డి(Minister Jagdish Reddy) అన్నారు. బుధవారంనాడు మంత్రి సూర్యాపేట(Suryapet)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో టికెట్ రానివారిని కాంగ్రెస్‌, బీజేపీ(Congress, BJP) పార్టీలల్లో చేర్చుకోవడానికి నానా తాపాత్రయం పడుతున్నారని ఎద్దేవ చేశారు. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరో చెప్పలేని పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా(Nalgonda District)లో మాది నెంబర్ వన్ టీం అని చెప్పారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని చెప్పారు. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడంపై ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి జగదీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ponguleti: నో డౌట్.. రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే..

Updated Date - 2023-08-23T15:23:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising