ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister KTR: రేవంత్‌రెడ్డి కాదు ఇప్పుడు రేటెంతరెడ్డి అంటున్నారు

ABN, First Publish Date - 2023-10-11T20:54:37+05:30

రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కాదు.. ఇప్పుడు రేటెంత‌రెడ్డి అని ఆ పార్టీ నేతలే అంటున్నారని మంత్రి కేటీఆర్(Minister KTR) సెటైర్లు వేశారు.

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కాదు.. ఇప్పుడు రేటెంత‌రెడ్డి అని ఆ పార్టీ నేతలే అంటున్నారని మంత్రి కేటీఆర్(Minister KTR) సెటైర్లు వేశారు. నల్గొండ జిల్లా దేవరకొండ కాంగ్రెస్ నేత బీల్యా నాయక్ బుధవారం నాడు తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్ష్యంలో బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘‘రైతులకు 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. విద్యుత్ రంగాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. సీఎం కేసీఆర్‌తో మాత్రమే గిరిజనులకు న్యాయం జరుగుతుంది. దశాబ్దాలు కొట్లాడిన బాగుపడని తాండాలు ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో బాగుపడుతున్నాయి. గిరిజనులకు కేసీఆర్ ఆత్మగౌరవాన్ని ఇస్తున్నారు. నాడు నల్లొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌తో వంకర తిరిగిన కాళ్లతో కనిపించేవారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక జిల్లాకు మంచి నీళ్లు అందాయి. అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది.

గత 15 రోజులుగా 30కి పైగా సభల్లో పాల్గొన్నాను. జనంలో బీఆర్ఎస్ పార్టీపై స్పందన బాగా కనిపిస్తుంది. ఒక్క చోట కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించటం లేదు. మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే అన్నిరంగాలు బాగుపడతాయని జనం నమ్ముతున్నారు. ఎన్నికలు వస్తున్నాయనే కాంగ్రెస్ నాయకులు కల్ల బొల్లి మాటలతో మభ్యపెట్టడానికి బస్సుయాత్రతో వస్తారు. వారిని నమ్మితే బతుకులు ఆగం అవుతాయి. పార్టీ కార్యాలయానికి కొత్త రంగులు వేసుకుంటారు, కొత్త డ్రెస్సులు కుట్టించుకుంటారు. గత ఎన్నికల్లో కేసీఆర్ గెలిస్తే గడ్డం తీస్తానని ఒకరు అన్నారు. ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మరొకరు అంటున్నారు. అయినా ఆ నాయకులే మళ్లీ పోటీ చేస్తున్నారు. ఆ నాయకుడు నోటుకు సీటు అమ్ముకుంటున్నాడు. ఇన్నేళ్లలో ఏం చేయని కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నేతలు మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారు. 24 గంటల కరెంట్ బీఆర్ఎస్ ఇస్తుంటే కాంగ్రెస్ 48 గంటల కరెంట్ ఇస్తామని చెబుతోంది. భారతదేశంలో తెలంగాణను కేసీఆర్ నంబర్1 స్థానంలో నిలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కేసీఆర్ 5లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఇచ్చారు. ఏడాదిలో డిండి ప్రాజెక్ట్ పూర్తిచేసి దేవరకొండను సస్యశ్యామలం చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ కాదు, 11 ఛాన్సులు ఇచ్చాం. ఇన్నేళ్ల వాళ్ల పాలన మనం చూడలేదా..? అప్పుడెందుకు తెలంగాణను అభివృద్ధి చేయలేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి’’ అని మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-11T21:12:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising