ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: వారంటీ లేని కాంగ్రెస్‌ను నమ్మొద్దు

ABN, First Publish Date - 2023-10-02T14:54:07+05:30

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలి. ఎవరికి డిపాజిట్ రాదో తెలుస్తుంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సవాల్ చేస్తున్నా. ఎంతమంది వచ్చినా సరే.. బస్సులు మావే.. ఖర్చులు మావే.... ఏం టైమ్‌కు పోయినా ఓకే

సూర్యాపేట: కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు. సూర్యాపేటలో ఐటీ హబ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించి మాట్లాడారు. ‘‘కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలి. ఎవరికి డిపాజిట్ రాదో తెలుస్తుంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సవాల్ చేస్తున్నా. ఎంతమంది వచ్చినా సరే.. బస్సులు మావే.. ఖర్చులు మావే.... ఏం టైమ్‌కు పోయినా ఓకే. కరెంటు తీగలు పట్టుకుంటే తెలుస్తుంది. కరెంటు ఉందో లేదో. వారంటీ లేని గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీవి. ఆరు దశబ్దాలు పాలించినా ఏమీ చేయకుండా మళ్లీ ఆరు గ్యారంటీలా?. ఓటుకు నోటు కేసులో దొరికి ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునే వారి మాటలు నమ్మొద్దు. ప్రధాని మోదీ (PM MODI) అన్నట్టుగానే మాది కుటుంబ పాలనే. అద్భుతాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీది (BRS) వారసత్వ రాజకీయమే. మాది మహాత్మా గాంధీ వారసత్వం.. మోదీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. మంత్రి జగదీష్ రెడ్డి చేసిన సేవ, అభివృద్ధికి 50 వేల మెజార్టీతో గెలిపించాలి.’’ అని కేటీఆర్ కోరారు.

Updated Date - 2023-10-02T14:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising