ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vemula Viresham: బీఆర్ఎస్‌కు బిగ్ ఝలక్.. పార్టీ మారనున్న ఆ కీలక నేత.. ఎవరంటే..?

ABN, First Publish Date - 2023-09-22T17:38:48+05:30

కొన్ని రోజులుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Viresham) బీఆర్ఎస్ పార్టీ(BRS party)లో అసంతృప్తిగా ఉన్నారు.

ఢిల్లీ: గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ(BRS party)పై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Viresham)అసంతృప్తిగా ఉన్నారు. పలుమార్లు సీఎం కేసీఆర్‌(CM KCR)ని కలవడానికి అనుమతి ఇవ్వాలని కోరినా పట్టించుకోకపోవడంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ(Congress party)లో చేరేందుకు పచ్చజెండా ఊపారు. ఇటీవల కొంతమంది కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వీరేశంను కలిసి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో ఈ రోజు వేముల వీరేశం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల సీట్లలో తనకు టికెట్ కేటాయిస్తారని వేముల వీరేశం భావించారు. కానీ గులాబీ బాస్ ఆయనకు మొండి చేయి చూపించారు. పార్టీ మారితేనే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావించిన వేముల వీరేశం కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రోజు లేదా రేపు ఉదయం వేముల వీరేశం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలతో వేముల వీరేశం ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈరోజు 7:30 గంటలకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో వేముల వీరేశం కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

Updated Date - 2023-09-22T17:47:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising