ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nampally Court: నాంపల్లి కోర్టులో చికోటి ప్రవీణ్‌కు ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు

ABN, First Publish Date - 2023-07-26T19:33:13+05:30

నాంపల్లి కోర్టులో (Nampally Court) చికోటి ప్రవీణ్‌కు (Chikoti Praveen) ఊరట లభించింది.

హైదరాబాద్: నాంపల్లి కోర్టులో (Nampally Court) చికోటి ప్రవీణ్‌కు (Chikoti Praveen) ఊరట లభించింది. ఈ మేరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లు నాంపల్లి కోర్టు తెలిపింది. చికోటి ప్రవీణ్‌పై గతంలో ఛత్రినాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల్లో చికోటి గన్‌మెన్స్‌తో గుడికి వెళ్లారని ఆరోపణలు వచ్చాయి. అనుమతి లేకుండా గన్స్ క్యారీ చేయడంపై చీకోటిపై కేసు నమోదు చేశారు. చికోటిపై ఆమ్స్ యాక్ట్‌తో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు గన్‌మెన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో చికోటి ప్రవీణ్ ఏ వన్‌గా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో చికోటి ప్రవీణ్‌కు ఉపశమనం కలిగించినట్లయింది.


కాగా.. ఆదివారం నాడు పాతబస్తిలో జరిగిన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గరికి ప్రైవేట్ సెక్యూరిటీతో చికోటి వచ్చారు. ఆ సిబ్బందిలో ముగ్గురి వద్ద ఆయుధాలు ఉండటంతో టాస్క్‌ఫోర్సు పోలీసులు వారిని అదుపులోనికి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఆ వెపన్స్‌కు లైసెన్స్ లేకపోవడంతో చత్రినాక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. చికోటి ప్రవీణ్‌తో పాటు ముగ్గురు వ్యక్తిగత సిబ్బందిపై కూడా చీటింగ్, ఫోర్జరీ, ఆర్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. A1 గా చికోటి ప్రవీణ్, A2 గా రాకేష్, A3 గా సుందర్ నాయక్, A4 గా రమేష్ గౌడ్‌లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-07-26T19:33:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising