Nampally Court: మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితుల పోలీసు కస్టడీకి అనుమతి
ABN, First Publish Date - 2023-09-12T20:19:34+05:30
మాదాపూర్ డ్రగ్స్ కేసులో (Madapur drug case) నిందితులను కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు (Nampally Court) అనుమతి ఇచ్చింది.
హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో (Madapur drug case) నిందితులను కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు (Nampally Court) అనుమతి ఇచ్చింది. నిందితులను నాలుగు రోజుల కస్టడీకి అనుమతించినట్లు నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. బాలాజీ, వెంకటరత్నారెడ్డి, మురళిల గుడిమల్కాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 18 మందికి మాదకద్రవ్యాలు సరఫరా చేసినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సినీ రంగానికి చెందిన పలువురికి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు.
Updated Date - 2023-09-12T20:20:41+05:30 IST