Dharmapuri Arvind: ఎమ్మెల్సీ కవితపై అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-07-24T17:20:22+05:30
నా మీద పోటీ చేసేందుకు కవిత భయపడుతోంది. వేరే అభ్యర్థిని బరిలో ఉంచి నన్ను ఓడిస్తుందట. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే డిప్యూటీ సీఎం సిసోడియా జైలు పాలయ్యారు. ఆయనను చూసేందుకు కవితక్క కూడా పోతాది.
జగిత్యాల: ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) మరోసారి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (BJP MP Dharmapuri Arvind) విమర్శలు గుప్పించారు. ప్రపంచ అవినీతిపరురాలు కవిత అంటూ వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నా మీద పోటీ చేసేందుకు కవిత భయపడుతోంది. వేరే అభ్యర్థిని బరిలో ఉంచి నన్ను ఓడిస్తుందట. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే డిప్యూటీ సీఎం సిసోడియా జైలు పాలయ్యారు. ఆయనను చూసేందుకు కవితక్క కూడా పోతాది. అందరూ దేవున్ని మొక్కండి కవిత జైలుకు పోవాలని. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నాకు తండ్రితో సమానం. కానీ కాంగ్రెస్ పని అయిపోయింది.’’ అని అరవింద్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-07-24T17:20:22+05:30 IST