BRS: యూటర్న్ తీసుకున్న బీఆర్ఎస్ అసంతృప్త కౌన్సిలర్లు
ABN, First Publish Date - 2023-10-20T21:18:23+05:30
కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ అసంతృప్త కౌన్సిలర్లు యూటర్న్ తీసుకున్నారు. మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎన్నికల ఇన్చార్జ్ శేరి సుభాష్రెడ్డితో అసంతృప్త కౌన్సిలర్స్ సమావేశమయ్యారు.
కామారెడ్డి: కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ అసంతృప్త కౌన్సిలర్లు యూటర్న్ తీసుకున్నారు. మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎన్నికల ఇన్చార్జ్ శేరి సుభాష్రెడ్డితో అసంతృప్త కౌన్సిలర్స్ సమావేశమయ్యారు. చాలా రోజులుగా అంతర్గతంగా నలిగిపోతూ అవమానాలకు, వివక్షకు గురవుతున్నామని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారేది లేదని అసంతృప్తి కౌన్సిలర్స్ తెలిపారు. స్పష్టమైన హామీతో కేసీఆర్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అసంతృప్త కౌన్సిలర్లు తెలిపారు.
Updated Date - 2023-10-20T21:18:23+05:30 IST