ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawan Kalyan: అంశాల స్వామి మరణం బాధాకరం

ABN, First Publish Date - 2023-01-28T17:27:05+05:30

ఫ్లోరైడ్ విముక్త పోరాట నేత అంశాల స్వామి (Amshala Swamy) మరణం బాధాకరమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) విచారం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఫ్లోరైడ్ విముక్త పోరాట నేత అంశాల స్వామి (Amshala Swamy) మరణం బాధాకరమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) విచారం వ్యక్తం చేశారు. అంశాల స్వామి కుటుంబసభ్యులకు పవన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫ్లోరైడ్ ప్రభావం నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా (Nalgonda District)కు విముక్తి చేయాలంటూ మూడు దశాబ్ధాల కాలం నుంచి రాజీలేని పోరాటం చేశారని పవన్కల్యాణ్ కొనియాడారు. స్వామి అకాల మరణ మృతి పట్ల కేటీఆర్ (KTR) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అంశాల స్వామి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫ్లోరోసిస్ (Fluorosis) బాధితుల కోసం ఆయన చేసిన పోరాటం అసమాన్యమని ప్రశంసించారు. ‘‘స్వామి చాలా మందికి ప్రేరణ. అతను ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటాడు. స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వామితో కలిసి భోజనం చేసిన ఫోటోను కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఫ్లోరోసిస్ రక్కసిపై అలుపెరుగని పోరాటం చేసిన అంశాల స్వామి ఇకలేరు. ట్రై సైకిల్‌పై నుంచి ఆయన ప్రమాదవాశాత్తు కింద పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. పుట్టుకతోనే ఫ్లోరోసిస్ బారిన పడిన అంశాల స్వామి.. గత 32 ఏళ్లుగా ఫ్లోరోసిస్ సమస్యపై అలుపెరుగని పోరాటం చేశారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన అంశుల స్వామి పుట్టుకతోనే ఫ్లోరోసిస్ బాధితుడు. ఆరో తరగతి వరకు చదివిన 32ఏళ్ల అంశుల స్వామి ఎక్కడికి వెళ్లాలన్నా వీల్‌చైర్‌లో ఒకరు తోడుగా ఉండి వెంట తీసుకెళ్లాల్సి ఉంది. ఫ్లోరోసిస్‌ నుంచి విముక్తి పొందాలంటే మంచినీరు కావాలని ఫ్లోరైడ్‌ విముక్తిపోరాట సమితి కన్వీనర్‌ కంచుకట్ల సుభాష్‌తో కలిసి అంశుల స్వామి గల్లీ నుంచి డిల్లీ వరకు ఉద్యమించాడు. ఎటూ కదల్లేని స్థితిలోనూ తనలాంటి బాధితుల కోసం తన గళాన్ని వినిపించారు. జిల్లాలో మిషన్‌ భగీరథ నీళ్లు, శివన్నగూడెం ప్రాజెక్టు సాధనకు అంశల స్వామి కృషి చేశారు.

Updated Date - 2023-01-28T17:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising