ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi: చిన్నారి 'భరతమాత'కు మోదీ అభివాదం

ABN, First Publish Date - 2023-11-26T19:50:40+05:30

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్‌ (Nirmal) లో ఆదివారంనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ర్యాలీలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ర్యాలీకి హాజరైన ఓ చిన్నారి ప్రధాని దృష్టికి ఆకట్టుకుంటుంది. ఆయన చేతులు ఊపుతూ ఆ చిన్నారికి అభివాదం చేశారు. అందుకు ప్రతిగా ఆ చిన్నారి సైతం చేతులోని మువ్వన్నెల జెండాను ఊపుతూనే ఆయనకు తిరిగి అభివాదం చేసింది.

నిర్మల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly polls) ప్రచారంలో భాగంగా నిర్మల్‌ (Nirmal)లో ఆదివారంనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్న ర్యాలీలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ర్యాలీకి హాజరైన ఓ చిన్నారి ప్రధాని దృష్టికి ఆకట్టుకుంటుంది. ఆయన చేతులు ఊపుతూ ఆ చిన్నారికి అభివాదం చేశారు. అందుకు ప్రతిగా ఆ చిన్నారి సైతం చేతులోని మువ్వన్నెల జెండాను ఊపుతూనే ఆయనకు తిరిగి అభివాదం చేసింది.


భరతమాత వేషంలో ర్యాలీకి వచ్చిన చిన్నారిని ఆమె తల్లిదండ్రులు ఎత్తుకోగా, ఆ పాప మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. ఇది గమనించి ప్రధాని వేదికపై నుంచే చేతులు ఊపుతూ 'వెల్ డన్ బేటా' అంటూ అభినందించారు. చిన్నారి భరతమాతకు ఆయన నమస్తే చెప్పారు. ఇందుకు ప్రతిగా ఆ పాప సైతం ప్రధానికి నమస్తే చెప్పింది. దీంతో బీజేపీ కార్యకర్తలు, ర్యాలీకి హాజరైన ప్రజానీకంలో మరింత ఉత్సాహం తొంగిచూసింది.

Updated Date - 2023-11-26T19:50:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising