ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Drugs: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలను వెల్లడించిన పోలీసులు

ABN, First Publish Date - 2023-07-25T18:58:04+05:30

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. ఇన్‌వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ తరహాలోనే డ్రగ్స్ కేసులోనూ విదేశాలకు ప్రాఫిట్ మళ్లించినట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. ఇన్‌వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ తరహాలోనే డ్రగ్స్ కేసులోనూ విదేశాలకు ప్రాఫిట్ మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం ముగ్గురు నైజీరియన్లతో పాటు ఇద్దరు స్వదేశీయులను అదుపులోకి తీసుకునట్లు హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు తెలిపారు. వీరి లావాదేవీలపై దృష్టి పోలీసులు పెట్టారు. డ్రగ్స్ కోసం కస్టమర్ల నుంచి రూ. 4 కోట్లు వసూలు చేశారు. 4 కోట్ల రూపాయలను 22 విదేశీ అకౌంటులకు మళ్లించినట్టు గుర్తించారు.


22 అకౌంట్లోను హెన్రీ అనే డ్రగ్ సప్లయర్ ఆపరేట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హెన్రీ కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. 22 బ్యాంక్ అకౌంట్స్ పరిశీలన కోసం హైదరాబాద్ పోలీసులు ప్రైవేట్ ఏజెన్సీని ఆశ్రయించారు. నిందితుల వద్ద నుంచి 200 మంది కస్టమర్లు డ్రగ్స్ సేకరించినట్టు గుర్తించారు. వీరిలో 90 శాతం బెంగళూరుకు చెందిన కస్టమర్లు ఉన్నట్టు గుర్తించారు. మరో 10 శాతం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కస్టమర్లు ఉన్నట్టు తెలిసింది. తెలుగు రాష్ట్రాల కస్టమర్స్‌గా ఉన్నవారు బెంగళూరులో చదువుకునే రోజుల్లో డ్రగ్స్ కొన్నట్టు పోలీసులు గుర్తించారు.

Updated Date - 2023-07-25T18:58:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising