ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kishan Reddy: రాష్ట్రపతి, లోకసభ స్పీకర్‌కు కిషన్ రెడ్డి లేఖ.. నా అరెస్టుకు కారణం కేసీఆరే..?

ABN, First Publish Date - 2023-07-20T19:17:47+05:30

రాష్ట్రపతితో పాటు (President) లోక్‌సభ స్పీకర్‌కు (Lok Sabha Speaker) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) లేఖ రాశారు.

హైదరాబాద్: రాష్ట్రపతితో పాటు (President) లోక్‌సభ స్పీకర్‌కు (Lok Sabha Speaker) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) లేఖ రాశారు.


"తన హక్కులకు భంగం కలిగించిన పోలీసులపై ఫిర్యాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై కక్ష కట్టారు. కేసీఆర్ ఆదేశాలతోనే నన్ను అరెస్టు చేశారు. నా అరెస్టుకు కారణం కేసీఆర్. నన్ను అకారణంగా అరెస్టు చేసినందుకు కేసీఆర్‌ను తప్పుపడుతున్నాను. కేసీఆర్ ఒత్తిడి వల్లే పోలీసులు నన్ను అరెస్టు చేశారు." అని లేఖలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రస్తావించారు.


ఈ రోజు మధ్యాహ్నం బాటసింగారంకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కిషన్‌రెడ్డి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఎమ్మెల్యే రఘునందన్ రావుతో (MLA Raghunandan rao) కలిసి బాటసింగారంకు బయలుదేరారు. బాట సింగారంలో డబుల్ బెడ్రూం ఇళ్ళను పరిశీలించేందుకు కేంద్రమంత్రి అక్కడకు పయనమయ్యారు. అయితే కేంద్రమంత్రి అయిన కిషన్‌రెడ్డిని అడ్డుకుంటారా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఎయిర్‌పోర్టు పరిధి దాటగానే వాహనాలను అడ్డుపెట్టి మరీ కేంద్రమంత్రి కాన్వాయ్‌ను పోలీసులు ఆపేశారు. దీంతో పోలీసులతో కిషన్ రెడ్డి, రఘునందనరావు వాగ్వివాదానికి దిగారు. అధికారిక కార్యక్రమం కాదు కాబట్టి.. కేంద్రమంత్రిని అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు, నాయకులు భగ్గుమంటున్నారు. చివరకు బలవంతంగా కిషన్‌రెడ్డి, రఘునందన్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కాగా.. బీజేపీ చలో బాటసింగరాం పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ నేతలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల సహా.. బీజేపీ కార్పోరేటర్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనుమతి లేనందున బీజేపీ నేతలెవరూ బాట సింగారం రావొద్దని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2023-07-20T19:22:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising