Priyanka Gandhi: ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి
ABN, First Publish Date - 2023-10-18T18:50:18+05:30
రామాంజపురంలో కాంగ్రెస్ సభలో ప్రియాంకగాంధీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
ములుగు జిల్లా: రామాంజపురంలో కాంగ్రెస్ సభలో ప్రియాంకగాంధీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
"BRS పాలనలో ప్రజలు ఆనందంగా లేరు. తెలంగాణ ఏర్పడినా సామాజిక న్యాయం దక్కలేదు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. తెలంగాణ ఒక పుణ్యభూమి. తెలంగాణ కోసం ఎంతోమంది జీవితాలు త్యాగం చేశారు. తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్ అర్థం చేసుకుంది. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చాం. రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణ ఇచ్చాం. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల ఆకాంక్షలకే విలువ ఇస్తుంది." అని ప్రియాంకగాంధీ అన్నారు.
"తొమ్మిదేళ్ల తెలంగాణలో అత్యాచారాలు, అరాచకాలు, ఆత్మహత్యలు, ఆధిపత్యమే కనిపిస్తుంది. రాష్ట్రాన్ని రక్షించేందుకు సోనియా గాంధీ కుటుంబం మన ముందుకు వచ్చింది. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది... కానీ ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదు. అందుకే సోనియా గాంధీ 6 గ్యారంటీలు ఇచ్చారు. పేద ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు, తులం బంగారం ఇస్తాం. ములుగులో సీతక్కను, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావును గెలిపించాలి." అని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ సభలో సీతక్క మాట్లాడుతూ ములుగులో అనేక కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. వాళ్లు ఎన్ని చేసినా ప్రజలే నాదేవుళ్లు. నియోజకవర్గం విడిచి నేను ఎక్కడికీ వెళ్లను." అని సీతక్క అన్నారు.
రామాంజపురంలో కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-18T18:50:34+05:30 IST