ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: తాండూర్‌లో మహిళను హత్య చేసిన సైకో కిల్లర్

ABN, First Publish Date - 2023-12-08T23:02:15+05:30

జిల్లాలోని తాండూర్‌ ( Tandoor ) లో అదృశ్యమైన మహిళ హత్యగావించబడింది. ఒంటిపై ఉన్న ఆభరణాల కోసమే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్య చేసింది సైకో కిల్లర్‌ అని, 6 కేసుల్లో నిందితుడు, రౌడీ షీటర్ అని డీఎస్పీ శేఖర్ గౌడ్ ( DSP Shekhar Goud ) మీడియాకు తెలిపారు.

వికారాబాద్ జిల్లా: జిల్లాలోని తాండూర్‌ ( Tandoor ) లో అదృశ్యమైన మహిళ హత్యగావించబడింది. ఒంటిపై ఉన్న ఆభరణాల కోసమే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్య చేసింది సైకో కిల్లర్‌ అని, 6 కేసుల్లో నిందితుడు, రౌడీ షీటర్ అని డీఎస్పీ శేఖర్ గౌడ్ ( DSP Shekhar Goud ) మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ... గత నెల 29వ తేదీన తాండూర్‌కు చెందిన సర్వబీ కూలి పని కోసం వెళ్లి అదృశ్యం అయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈనెల 1వ తేదీన తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదయింది. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. హత్య గావించబడిన మహిళ మరో వ్యక్తితో మాట్లాడుతున్న దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. మహిళను హత్య చేసింది ధరూర్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన మాల కిష్టయ్యగా పోలీసులు గుర్తించారు.

కిష్టయ్యను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు.మహిళకు కూలి పని ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి పెద్దేముల్ మండలం తాట్టేపల్లి అడవిలోకి తీసుకెళ్లి ఆమె చీర కొంగు మెడకు బిగించి హత్య చేశాడని తెలిపారు. నిన్న (గురువారం) మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అక్కడే శవపరీక్ష నిర్వహించారు. నిందితుడి దగ్గర చైన్, 1000 రూపాయలు ఒక ఫోన్‌ని పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. గతంలో కూడా నిందితుడు కూలి పనికి వచ్చే మహిళలను టార్గెట్‌ చేసి హత్య చేస్తున్నాడని విచారణలో వెల్లడైందని చెప్పారు. ఇప్పటి వరకు నిందితుడిపై ఆరు కేసులు ఉన్నాయని.. ఐదు కేసులను కోర్టు కొట్టివేసిందన్నారు. మరో కేసులో నిందితుడుగా ఉన్నాడని.. ఈ కేసుతో సైకో కిల్లర్ మొత్తం ఏడు హత్యలు చేశాడని డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు.

Updated Date - 2023-12-08T23:02:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising