Vamsichander Reddy: వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే జైపాల్‌ని ఘోరంగా ఓడించాలి
ABN, First Publish Date - 2023-10-10T19:01:35+05:30
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్(MLA Gurkha Jaipal Yadav)ని ఘోరంగా ఓడించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వంశీచందర్‌రెడ్డి (Vamsichander Reddy) పిలుపునిచ్చారు.
కల్వకుర్తి: వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్(MLA Gurkha Jaipal Yadav)ని ఘోరంగా ఓడించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వంశీచందర్‌రెడ్డి(Vamsichander Reddy) పిలుపునిచ్చారు. మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ మండలం అయ్యసాగర్ సమీపంలో కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వంశీచందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా వైస్ చైర్మన్. బాలాజీ సింగ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా వంశీచందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఓ బ్రోకర్. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడాలి. జైపాల్ యాదవ్ బీసీ ద్రోహి. పేదల గురించి ఏనాడు అసెంబ్లీలో మాట్లాడలేని దౌర్భాగ్యుడు జైపాల్ యాదవ్‌ను గ్రామంలోకి వస్తే తరిమికొట్టాలి. జైపాల్ యాదవ్ 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి కల్వకుర్తి ప్రజలకు ఏం చేయలేదు. కల్వకుర్తి అభివృద్ధిపై ఎమ్మెల్యే జైపాల్ చర్చకు సిద్ధమా అని వంశీచంద్‌రెడ్డి సవాల్ విసిరారు.
అభివృద్ధి నిరోధకుడు జైపాల్ యాదవ్: కసిరెడ్డి
అనంతరం ఎమ్మెల్సీ (MLC) కసిరెడ్డి నారాయణరెడ్డి(Kasireddy Narayana Reddy) మీడియాతో మాట్లాడుతూ.. జైపాల్ యాదవ్ అభివృద్ధి నిరోధకుడు. నాలుగున్నరేళ్లలో KLI కాల్వ పనులను పూర్తి చేయించలేని అసమర్ధుడు జైపాల్ యాదవ్ అని అన్నారు. ప్రజా సంక్షేమ పథకాల పేరుతో ఆర్థిక వ్యవస్థని లూటీ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో అర్హులు ఎవరికీ సంక్షేమ పథకాలు అందడం లేదని కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-10-10T19:01:35+05:30 IST