ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sabita Indra Reddy: పోడు భూమిపై రైతులకు కేసీఆర్ సంపూర్ణ హక్కు కల్పించారు

ABN, First Publish Date - 2023-06-30T17:33:13+05:30

వికారాబాద్ జిల్లాలో 436 మంది పోడు రైతులకు (farmers) 552 ఎకరాల భూమి పట్టాల పంపిణి చేసినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో 436 మంది పోడు రైతులకు (farmers) 552 ఎకరాల భూమి పట్టాల పంపిణి చేసినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) తెలిపారు. పోడు భూముల్లో ఎప్పుడు ఎవరోస్తారో... ఎవరు గుంజుంకుటారోననే భయం లేకుండా అన్ని శాఖల అధికారుల ద్వారా పోడు పట్టాల పంపిణీ చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూమిపై రైతులకు సంపూర్ణ హక్కు కల్పించిన మహానాయకుడు సీఎం కేసీఆర్ (CM KCR) అని సబిత అన్నారు.

ఫారెస్ట్ భూములు కాపాడుకుంటూనే...మరో పక్క పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో పట్టాలు పంపిణీ చేశామన్నారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి కావడంతోనే ప్రతి గిరిజన తాండాను పంచాయతీ చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు.

గిరిజనుల అభివృద్ధికి పాటు పడుతూ... గిరిజనులు హైదరాబాద్ వెళ్లితే అందరూ కలిసి ఉండేలా బంజారాహిల్స్‌లో బంజారా భవన్ నిర్మాణం చేశారని, ప్రతి నియోజకవర్గంలో గిరిజనులంతా కలిసేందుకు ఒక బంజారా భవన్ నిర్మాణం చేపడుతున్నామన్నారు.

గిరిజన విద్యార్థుల కోసం గిరిజన గురుకులాలను ప్రవేశపెట్టి నాణ్యమైన విద్యను కేసీఆర్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఎస్సీ 10శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా ఇవ్వకపోతే కేసీఆర్ నే ఇవ్వడంతో ఎంతో మంది గిరిజనులు ఉద్యోగాలు పొందారని, ప్రతి గిరిజన తాండాకు రూ. 20 కోట్లు ఖర్చు చేసి గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో పోడు రైతులకు పట్టాల పంపిణి కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా రెడ్డి, ఎంపీ రంజీత్ రెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి ఎమ్మెల్యేలు ఆనంద్, మహేష్ రెడ్డి, రోహిత్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-06-30T17:33:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising