ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadagirigutta: యాదగిరిగుట్టలో భద్రత పటిష్ఠం

ABN, First Publish Date - 2023-04-28T19:58:02+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) ఆలయ భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తిరుమల తిరుపతి దేవస్థానం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) ఆలయ భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో భక్తులకు భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతాలను సంరక్షించేందుకు ప్రభుత్వం పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీస్‌ అధికారులు, సిబ్బందిని బదిలీ చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రస్తుతం ఉన్న భద్రతా సిబ్బందికి తోడు, మరికొంతమందిని నియమించింది. ఆలయ భద్రతకు ఇటీవల ప్రత్యేకంగా ఏసీపీ స్థాయి అధికారితోపాటు టీఎస్‌పీఎఫ్‌ (తెలంగాణ స్టేట్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌) అసిస్టెంట్‌ కమాండెంట్‌ను నియమించింది. దేశంలోనే అద్భుతమైన దివ్యక్షేత్రం యాదగిరిగుట్టను సందర్శించే భక్తులకు రక్షణ.. ఆలయ పరిసరాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పటిష్ఠమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా కొండపైన ప్రధానాలయం, శివాలయం, పరిసరాలు, టెంపుల్‌ సిటీ, టెంపుల్‌ సిటీలోకి ప్రవేశించే ద్వారాలన్నింటి వద్ద పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు. యాదగిగిరిగుట్ట పట్టణంతోపాటు కొండపై ప్రతీ కోణంలో సీసీ కెమెరాలు, గుట్టపైకి ప్రవేశించే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి ఆధునిక వెహికల్‌ స్కానర్లు, మెటల్‌ డిటెక్టర్లు, మెటల్‌ డిటెక్టర్‌ ద్వారాలను ఏర్పాటు చేయనున్నారు.

రూ.2.50 కోట్లతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

యాదగిరిగుట్టపైన ఆలయం, పరిసరాలు, టెంపుల్‌ సిటీ పరిసరాల్లో పటిష్ఠమైన భద్రతా వ్యవస్థ నిరంతర పర్యవేక్షణకు అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఇందుకోసం కొండపైన ప్రత్యేకంగా రూ.2.50కోట్లతో భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని ఇటీవల రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీ.ఎస్‌.చౌహాన్‌ (DS Chauhan) ప్రారంభించారు. గుట్టను సందర్శించే భక్తులకు రక్షణ.. ఆలయ పరిసరాల భద్రతను పర్యవేక్షించడానికి ఈసీఐఎల్‌ సంస్థ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంగల పరికరాలను సమకూర్చారు. అధికారులు ఎప్పటికప్పుడు కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు. కొండపైన, కింద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-04-28T19:58:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising