Suravaram Sudhakar Reddy: చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ హస్తం
ABN, First Publish Date - 2023-09-17T16:52:48+05:30
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌoడ్‌లో జరిగిన సభలో సీపీఐ (CPI) మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌoడ్‌లో జరిగిన సభలో సీపీఐ (CPI) మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టులది మాత్రమే.. దాన్ని డిమాండ్ చేసే నైతిక హక్కు ఎవరికీ లేదు. 4500 మంది అమరులయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక్క శాతం వాటా లేని బీజేపీ సైతం సిగ్గులేకుండా విమోచన దినోత్సవాలు జరుపుకుంటున్నారు. బీజేపీ నేతలు హిందూ, ముస్లిం గొడవగా చిత్రీకరిస్తూ, చరిత్రను వక్రీకరిస్తున్నారు. విలీన దినోత్సవం జరపడం చేతకాక, దైర్యం లేక సమైక్యత వారోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. సమైక్యత ఎవరికీ...?. సమైక్యత వారోత్సవాలను కమ్యూనిస్టులు ఒప్పుకోరు. మహమ్మద్ ఆలీ జిన్నా గతంలో హిందుస్థాన్, పాకిస్తాన్ లు మాత్రమే ఉన్నాయన్నారు. అందుకు బ్రిటిష్ లు ఒప్పుకోలేదు. సిగ్గులేకుండా మహమ్మద్ అలీ జిన్నా ఒప్పందాన్ని నరేంద్ర మోదీ అమలుపరుస్తున్నారు. ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు మోడీ ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ మతోన్మాద విధానాల నుంచి దేశం భయట పడాలి. చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ హస్తం ఉంది. జగన్ తో ఉన్న ఒప్పందం ప్రకారమే చంద్రబాబు అరెస్ట్ జరిగింది. ముందు బాబు, తరువాత జగన్ పని పట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. దేశం సర్వ మతాలతో కలిసి ఉండాలంటే దేశం నుంచి బీజేపీ ష్కతులను పారద్రోలాలి." అని సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు.
Updated Date - 2023-09-17T16:53:10+05:30 IST