ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Talasani: మంత్రి తలసాని సంచలన కామెంట్స్.. బీఆర్‌ఎస్‌ను ఓడించే దమ్ము ఎవరికీ లేదు

ABN, First Publish Date - 2023-11-09T08:53:15+05:30

బీఆర్‌ఎ్‌సను ఓడించే దమ్ము ఎవరికీ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌(Minister Talasani Srinivasyadav)

నల్లకుంట(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సను ఓడించే దమ్ము ఎవరికీ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌(Minister Talasani Srinivasyadav) అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లోని గజానంద్‌గడ్డ, పాములబస్తీ, పోచమ్మబస్తీ, కుర్మబస్తీలో బీఆర్‌ఎస్‌ అంబర్‌పేట అభ్యర్థి, కాలేరు వెంకటేష్‌, కార్పొరేటర్‌ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేసిన మంత్రి తలసాని, ఎమ్మెల్యే కాలేరు వెంకటే్‌షలకు మహిళలు శాలువాకప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ పరిశీలకులు గండ్ర మోహన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సీ.హెచ్‌.చంద్రమోహన్‌, నాయకులు శ్రీపతిరెడ్డి, పద్మావతి పాల్గొన్నారు.

ప్రజలు బీఆర్‌ఎస్‏కు పట్టం కడతారు

గోల్నాక : ఐదేళ్లలో సాధించి అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించి బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించుకుంటారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరువెంకటేష్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోల్నాక డివిజన్‌లోని జైస్వాల్‌గార్డెన్‌కాలనీలో కాలేరు వెంకటేష్‌ పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర నిర్వహించి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఆర్‌.కె.బాబు, పులిజాల గెల్వయ్య, గండికోట జనార్ధన్‌, కొమ్ము శ్రీనివాస్‌, భూపతి లక్ష్మణ్‌, సురే్‌షగౌడ్‌, లింగంయాదవ్‌, కాలేరు రామకృష్ణ, డి.భరత్‌రాజ్‌ముదిరాజ్‌, రెడపాక రాము, కె.లక్ష్మణ్‌గౌడ్‌, గోపాల్‌, నల్లగొండ నరేందర్‌, సాయిప్రసాద్‌, పి.నిరంజన్‌, పి.అంజయ్యచారి, ప్రభాకర్‌ముదిరాజ్‌, ఉమేష్‌, వై.బుచ్చిరెడ్డి, మారుతీ ఎ.రామాగౌడ్‌ ఇంకా పలువురు మహిళలు పాల్గొన్నారు.

- గోల్నాక డివిజన్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకటేష్‌ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ దూసరి లావణ్యశ్రీనివా్‌సగౌడ్‌ దూరంగా ఉండడం విశేషం.

- అంబర్‌పేట: గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ మాజీ ఉపాధ్యక్షుడు కోట్ల రామకృష్ణ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

- నల్లకుంట: బాగ్‌అంబర్‌పేట ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, కార్పొరేటర్‌ బి.పద్మావెంకటరెడ్డి తదితరులు.

Updated Date - 2023-11-09T08:53:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising