ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS: బీఆర్ఎస్ పొత్తుపై స్పష్టత ఇచ్చిన తలసాని

ABN, First Publish Date - 2023-02-15T16:32:30+05:30

BRSకు ఏ పార్టీతో పొత్తు ఉండదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో BRSకు పూర్తి మెజార్టీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్: BRSకు ఏ పార్టీతో పొత్తు ఉండదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో BRSకు పూర్తి మెజార్టీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వామపక్షాల పొత్తు విషయంలో సీఎం మాట్లాడతారని తెలిపారు. BRS ఏ రాజకీయ పార్టీపై ఆధారపడదన్నారు. కిషన్‌రెడ్డి అంబర్‌పేట్‌లో ఏం అభివృద్ధి చేశారో చర్చకు తమ ఎమ్మెల్యే వెంకటేష్ సిద్ధంగా ఉన్నారని తలసాని సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ పొత్తుపై కోమటిరెడ్డి చెప్పిన మాట ఇదే

భవిష్యత్తులో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాదని ఆయన జోస్యం చెప్పారు. ఏ పార్టీ కూడా 60 సీట్లను గెలవలేదని హంగ్ తప్పదు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పార్టీని ఒక్కరే గెలిపించడం సాధ్యం కాదని పేర్కొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాడిలో పడుతుందని, కొత్త వారైనా పాతవారైనా గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

మరల కోమటిరెడ్డి ఏమన్నారంటే..?

రాష్ట్రంలో హంగ్ వస్తుంది. బీఆర్ఎస్- కాంగ్రెస్ పొత్తు ఉంటుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) చేసిన వ్యాఖ్యలపై ఆయన యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రంలో హంగ్ వస్తుందని తాను అనలేదు. నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పిందే తాను చెప్పానని అన్నారు. పార్టీలో చిన్న చిన్న నేతలు కూడా తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. నా వ్యాఖ్యలను బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారు. రాష్ట్రంలో హంగ్ వస్తుందని, బీఆర్ఎస్ హోం కాంగ్రెస్ పొత్తు ఉంటుందని తాను అనలేదని తెలిపారు. నేను తప్పు చేయలేదు, రాద్ధాంతం చేయొద్దని అన్నారు. నేను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, సోషల్ మీడియాలో వచ్చిన సర్వేల ఆధారంగా ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఆయా పార్టీల బలాబలాలేంటో చెప్పానని అన్నారు. నేను మార్నింగ్ చేసిన వ్యాఖ్యలు అర్ధం చూసుకునేదాన్ని బట్టి ఉంటుందన్నారు.

Updated Date - 2023-02-15T16:32:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising