పద్మ పురస్కారాలు అందుకున్న తెలుగు ప్రముఖులు
ABN , First Publish Date - 2023-03-23T02:34:38+05:30 IST
పద్మ పురస్కారాల మొదటి విడత ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ముర్ము పురస్కారాలను ప్రదానం చేశారు.
న్యూఢిల్లీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): పద్మ పురస్కారాల మొదటి విడత ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ముర్ము పురస్కారాలను ప్రదానం చేశారు. మొదటి విడత ప్రదానోత్సవంలో తెలంగాణ కోటాలో ఎంపికైక శ్రీరామచంద్ర మిషన్ ఆధ్యాత్మిక గురువు కమలేష్ డీ పటేల్ పద్మ భూషణ్ అందుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సంకురాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సంకురాత్రి చంద్రశేఖర్, శాస్త్రవేత్త ఎం విజయ్ గుప్తా, హరికథా కళాకారుడు కోటా సచ్చిదానంద శాస్త్రి, ప్రొఫెసర్ బీ రామకృష్ణారెడ్డి, కొయ్యబొమ్మల కళాకారుడు సీవీ రాజు, ప్రముఖ వైద్యుడు పుసుపులేటి హనుమంతరావు, విద్యావేత్త ప్రకాశ్ చంద్రసూద్ పద్మ అవార్డులను అందకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ పాల్గొన్నారు. కాగా జూలై 7నుంచి 9వరకు ఫిలడెల్పియాలో నిర్వహించనున్న తానా మహాసభలకు పద్మభూషణ్ కమలేష్ డీ పటేల్ విశిష్ట అతిథిగా హాజరవుతున్నట్లు సమన్వయకర్త పొట్లూరి రవి తెలిపారు.