ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: జూబ్లీహిల్స్‌ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

ABN, First Publish Date - 2023-05-30T16:47:17+05:30

జూబ్లీహిల్స్‌ (Jubilee Hills) చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రాజేష్‌ యాదవ్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఈ నెల 12న గర్భిణీని రాజేష్‌ యాదవ్‌ బెదిరించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ (Jubilee Hills) చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రాజేష్‌ యాదవ్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఈ నెల 12న గర్భిణీని రాజేష్‌ యాదవ్‌ బెదిరించి రూ.10 లక్షలు అపహరించాడు. నిందితుడి నుంచి రూ.9.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు జల్సాల కోసం దోపిడీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 12న జూబ్లీహిల్స్‌లో నిండు గర్భిణి మెడ మీద కత్తి పెట్టి 10 లక్షల రూపాయలు దోపిడీ చేసి పారిపోయాడు. అతణ్ని పట్టుకోవడానికి నగర పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి ముమ్మరంగా గాలించారు. నిందితుడు రోడ్డు నంబరు 52లో ఉన్న రాజు ఇంటి గురించి అవగాహన ఉన్నట్టుగానే నడుచుకుంటూ వచ్చి, నిచ్చెన సాయంతో లోపలికి ప్రవేశించినట్టు సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోంది. దీంతో.. ఇది బాధితు కుటుంబానికి తెలిసిన వారి పనై ఉంటుందా అని కూడా పోలీసులు అనుమానించారు. పారిపోవడానికి అవసరమైన క్యాబ్‌ను గర్భిణి చేతే దుండగుడు బుక్‌ చేయించుకున్నాడు. ఆ క్యాబ్‌లో షాద్‌నగర్‌ (Shadnagar)కు వెళ్లి, అక్కడే బస్టాప్‌ చుట్టు పక్కల కాసేపు తచ్చాడినట్టు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అనంతరం అక్కడ ఉన్న రెండు షాపుల్లో మూడు గంటల పాటు షాపింగ్‌ చేశాడు. ఓ షాపులో తన దుస్తులు మార్చి, కొత్త వాటిని ధరించాడు. ఆ తర్వాత కనిపించకుండాపోయాడు. ఇప్పుడు పోలీసులకు దొరికిపోయాడు.

Updated Date - 2023-05-30T16:47:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising