ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP: అమిత్‌షా షెడ్యూల్ ఇదే..

ABN, First Publish Date - 2023-04-22T21:45:55+05:30

రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) చేవెళ్లలో నేడు నిర్వహించే పార్లమెంటరీ ప్రవాస్‌ యోజన సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) రానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) చేవెళ్లలో నేడు నిర్వహించే పార్లమెంటరీ ప్రవాస్‌ యోజన సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) రానున్నారు. ఆదివారం 3:30గంటలకు ఆయన శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ (Shamshabad Airport)కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:50గంటలకు నోవాటెల్‌కి చేరుకొని సాయంత్రం 4గంటల వరకు ట్రిపుల్‌ ఆర్‌ సినిమా ఆస్కార్‌ విజేతలతో తేనీటి విందులో పాల్గొంటారు. 5:15గంటలకు బయల్దేరి రోడ్డు మార్గాన చేవెళ్లకు చేరుకుంటారు. 6గంటలకు అక్కడి బహిరంగ సభలో పాల్గొంటారు. 7:50 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు. బహిరంగ సభలో ఆయన పార్టీ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేయడంతో పాటు రానున్న ఎన్నికలకు సమరశంఖాన్ని పూరించనున్నారు. శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా అమిత్‌ షా ప్రసంగం ఉంటుందని బీజేపీ వర్గాలు తేల్చి చెప్పాయి. బహిరంగ సభ ఏర్పాట్లను చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Visveshwar Reddy) దగ్గరుండి పరిశీలించారు. శనివారం రాత్రి వరకూ ఏర్పాట్లపై పార్టీ నేతలతో చర్చిస్తూ పర్యవేక్షించారు. ఆయనతో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్‌, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.

తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ స్పీడ్‌ పెంచింది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మరో 8 నెలల్లో తెలంగాణ ఎన్నికలు ఉండటంతో బీజేపీ మరింత దూకుడు పెంచింది. కర్ణాటకలో ఎన్నికలు వచ్చే నెలలలో ముగియనున్న నేపథ్యంలో నెక్ట్స్‌ టార్గెట్‌ తెలంగాణపై బీజేపీ అధిష్టానం గురి పెట్టింది. ఇందులోభాగంగానే అమిత్‌షా తెలంగాణకు వస్తున్నారు. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంపై బీజేపీ దృష్టి సారించింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న అమిత్‌షా.. రాష్ట్ర పర్యటనకు వచ్చేందుకు సమయం కుదరలేదు. అయితే ఇప్పుడు చాలారోజుల తర్వాత అమిత్‌షా తెలంగాణలో పర్యటనకు వస్తున్నారు. ఇప్పటి నుంచి తెలంగాణలో అమిత్‌షా వరుస పర్యటనలు ఉంటాయని బీజేపీ శ్రేణులు కూడా చెబుతున్నాయి. రాబోయే రెండు నెలలపాటు అమిత్‌షా తెలంగాణపై దృష్టిపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2023-04-22T21:45:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising