ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Assembly RTC: ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో ట్విస్ట్.. కేసీఆర్ ప్రభుత్వానికి భారీ షాక్..!!

ABN, First Publish Date - 2023-08-04T12:38:52+05:30

రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనుకున్న కేసీఆర్ సర్కార్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ బిల్లుని ప్రవేశపెట్టాలనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్‌ ఆమోదం కోసం ప్రభుత్వం బిల్లుని పంపించగా.. ఇప్పటివరకు గవర్నర్ ఆమోదం లభించలేదు. గవర్నర్ కార్యాలయానికి పంపించామని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం (TSRTC Merge) చేయాలనుకున్న కేసీఆర్ సర్కార్‌కు (KCR Govt) అనూహ్య పరిణామం ఎదురైంది. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే (Assembly session) ఆర్టీసీ బిల్లుని (RTC bill) ప్రవేశపెట్టాలనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్‌ ఆమోదం కోసం ప్రభుత్వం బిల్లుని పంపించగా.. ఇప్పటివరకు గవర్నర్ ఆమోదం లభించలేదు. గవర్నర్ కార్యాలయానికి పంపించామని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అయితే తమకు ఎలాంటి బిల్లు అందలేదని రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆర్టీసీ బిల్లు విషయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకున్నట్టయ్యింది.

ఇదిలావుండగా.. ఆర్టీసీ విలీనం బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించి కేబినెట్‌ కూడా ఆమోదం తెలిపిన విషయం తెలిసింది. ఇక బిల్లు ఆమోదం పొందితే వచ్చే ఎన్నికల్లో మైలేజీ ఉంటుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచిచూడాలి.

Updated Date - 2023-08-04T12:44:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising