Tummala: మాజీమంత్రి తుమ్మల సంచలన కామెంట్స్.. అరాచక పాలన ముగింపు దశకు చేరింది
ABN, First Publish Date - 2023-10-25T13:46:33+05:30
ఖమ్మంలో జరుగుతున్న అరాచకపు పరిపాలన ముగింపు దశకు చేరిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం: ఖమ్మంలో జరుగుతున్న అరాచకపు పరిపాలన ముగింపు దశకు చేరిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) పేర్కొన్నారు. 40ఏళ్ల నా రాజకీయ చరిత్రలో ప్రతికార రాజకీయాలకు పాల్పడలేదన్నారు. మంగళవారం ఖమ్మంలోని తుమ్మల క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్ రావూరి కరుణ సైదబాబు ఆధ్వర్యంలో 300కుటుంబాలు బీఆర్‌ఎస్(BRS) నుంచి కాంగ్రెస్‌లో చేరారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. దళితబంధు, పింఛన్లు, రెండు పడకల ఇళ్లు ఇలా అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజాప్రతినిధుల దోపిడీ చేస్తున్నారు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రతీ ఓటరు ఆలోచించి ఓటు వేయాలని పిలుపు నిచ్చారు. ఉమ్మడి తెలుగురాష్ట్రంలో బెదిరింపు, అరాచక రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. మీరు ఓటు వేయటమే కాకాండా రాష్ట్ర వ్యాప్తంగా మీ బంధువులు స్నేహితులతో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటి పథకాలను ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌లో కష్టపడి పనిచేసి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి పని చేయాలన్నారు. అవమానాలకు, బెదిరింపులకు గురై కాంగ్రెస్‌లోకి వస్తున్న ప్రతీ ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు. నెల రోజులు కష్టపడితే జీవితాంతం మీతోనే ఉంటానన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌కు పట్ట కట్టాలన్నారు.
Updated Date - 2023-10-25T13:46:33+05:30 IST