Vijaya Reddy: బీఆర్ఎస్కు ఓట్లడిగే అర్హత లేదు.. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం..
ABN, First Publish Date - 2023-11-16T10:21:52+05:30
9 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిన అధికార బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు
ఖైరతాబాద్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): 9 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిన అధికార బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు ఓట్లు అడిగే అర్హత లేదని ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి(Vijaya Reddy) అన్నారు. బుధవారం ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానికులతో కలిసి ఖైరతాబాద్ మహాభారత్‌నగర్, ఇందిరానగర్, బీజేఆర్‌నగర్, మారుతీనగర్‌లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఆమెకు అడుగడుగునా స్థానికులు స్వాగతించి విజయం సాధిస్తావనే ధీమాను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయారెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే న్యాయం జరిగిందని గుర్తు చేశారు. పార్టీకి నష్టం వాటిల్లుతుందని తెలిసినా, తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చి త్యాగం చేసిన సోనియాగాంధీ నాయకత్వంలో తిరిగి కాంగ్రెస్ పాలన వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తామని, పేద ప్రజలు గౌరవ ప్రదంగా బతికేలా తమ పార్టీ ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ షరీఫ్, ఎన్‌ఎ్‌సయూఐ, యువజన కాంగ్రెస్, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2023-11-16T10:21:55+05:30 IST