ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Warangal: నేడు వరంగల్‌కు తెలంగాణ బీజేపీ నేతలు..

ABN, First Publish Date - 2023-07-02T07:50:28+05:30

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు ఆదివార వరంగల్‌కు వెళ్లనున్నారు. ఉప్పు నిప్పుగా ఉన్న ఈటల, బండి ఒకే వేదిక పంచుకోనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్ (Bandi Sanjay), ఈటల రాజేందర్ (Etala Rajendar), కిషన్ రెడ్డి Kishan Reddy), జితేందర్ రెడ్డి (Jitender Reddy) తదితరులు ఆదివారం వరంగల్‌కు వెళ్లనున్నారు. ఉప్పు నిప్పుగా ఉన్న ఈటల, బండి ఒకే వేదిక పంచుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Primeminister Narendra Modi) బహిరంగ సభకు సన్నాహక సమావేశం ఏర్పాట్లను బీజేపీ నేతలు (BJP Leaders) పరిశీలించనున్నారు. ఈ నెల 8న తెలంగాణ పర్యటనకు మోదీ రానున్నారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. వరంగల్ సభతో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది. ఖమ్మంలో నేటి కాంగ్రెస్ సభకు దీటుగా వరంగల్‌లో మోదీ సభను నిర్వహించాలని కమలం నేతలు నిర్ణయించారు.

కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనలో భాగంగా కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ బీజేపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు 8న‌ హైదరాబాద్‌లో (Hyderabad) జేపీ నడ్డా (JP Nadda) అధ్యక్షతన జరగాల్సిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా పడింది.

కాగా ఆదివారం సాయంత్రం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగే కాబినెట్ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ప్రచారం నేపథ్యంలో.. రేపటి కాబినెట్ కౌన్సిల్ మీటింగ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated Date - 2023-07-02T07:50:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising