ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jupally Krishna Rao: బీఆర్ఎస్ బహిష్కరణ వేటుపడిన జూపల్లి కృష్ణా రావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే...

ABN, First Publish Date - 2023-04-11T14:50:02+05:30

నాగర్ కర్నూల్ జిల్లా: వచ్చే ఎన్నికల్లో పాలమూరు జిల్లా (Palamuru Dist.)లో 13 స్థానాల్లో బీఆర్ఎస్ (BRS) వ్యతిరేకులు గెలుస్తారని జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నాగర్ కర్నూల్ జిల్లా: వచ్చే ఎన్నికల్లో పాలమూరు జిల్లా (Palamuru Dist.)లో 13 స్థానాల్లో బీఆర్ఎస్ (BRS) వ్యతిరేకులు గెలుస్తారని జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన కొల్లాపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ మూడోసారి రాష్ట్రాన్ని పాలించేహక్కు బీఆర్ఎస్‌కు లేదనన్నారు. బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) రాకుండా కావాల్సిన కార్యాచరణ చేస్తామని.. అది వ్యక్తులా, పార్టీలా అనేది భవిష్యత్‌లో తెలుస్తోందన్నారు. ఆత్మీయ సమ్మేళనాలకు ఎవరు పిలిచినా వెళ్తానని.. తప్పును ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

తాను అడిగిందానికి సమాధానం చెప్పకుండా నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఎదో ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 5 లక్షల బిల్లు బకాయిలకు రూ. 26 కోట్లు చెల్లించటం ఎంతవరకు సమంజసమన్నారు. మూడేళ్లుగా పార్టీ సభ్యత పుస్తకాలు అడిగినా ఇవ్వలేదనన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ (Suspend) చేయటం సంతోషంగా ఉందని.. దీంతో తన గౌరవం పెరిగిందన్నారు. సరిపోయినన్ని స్ధానాలు ఉండగా కొత్తగా 12 మంది ఎమ్మెల్యేల చేరికలు ఎందుకు? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఖతం చేయడానికా? అంటూ ప్రశ్నించారు.

తాను అమ్ముడు పోయే వస్తువును కాదని.. నిరంజన్ రెడ్డి సరైన ఉద్యమకారుడివైతే నీపై ఎన్ని కేసులున్నాయో..ఎప్పుడు జైలుకు పోయావో చెప్పాలని జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. కొల్లాపూర్‌లో 2004లో నిరంజన్ రెడ్డికి డిపాజిట్ రాలేదని.. మరి మంచి ఉద్యమకారుడివైతే ఎందుకు గెలువలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టారని, గ్రామాల్లో వచ్చే ఎన్నికల్లో తమ తరపున ఎవరు ఏజెంట్లుగా ఉండకూడదని అక్రమ కేసులు పెట్టి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కొత్త జిల్లాలు మంచివే కాని అధికారుల రిమోట్ ప్రగతి భవన్‌లో ఉండటంతో ఫలితాలు రావటం లేదన్నారు. నిరంజన్ రెడ్డి బండారం వనపర్తిలోనే బయట పెడతానని.. ఆయనకు మంత్రి పదవి కూడ తన వల్లే వచ్చిందని జూపల్లి కృష్ణారావు అన్నారు.

Updated Date - 2023-04-11T15:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising