Home » Kollapur
దొంగతనం కేసులో విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్కు వచ్చిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పోలీసుస్టేషన్లో గురువారం ఈ ఘటన జరిగింది.
ఓ చెంచు మహిళను నిర్బంధించిన ఆ కౌలుదార్లు అత్యంత క్రూరంగా హింసించారు. వివస్త్రను చేసి కొట్టారు. ఆపై పచ్చి మిరపకాయలను దంచి ఆమె కళ్లలో, మర్మాంగాల్లో పెట్టారు. మర్మాంగాలపై డీజిల్ పోసి అగ్గిపుల గీసి కాల్చారు.
Telangana Elections: కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శిరీషకు భద్రత కల్పించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తనకు భద్రత కావాలంటూ బర్రెలక్క హైకోర్టును ఆశ్రయించగా.. ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం విచారణ చేస్తామని కోర్టు తెలిపింది. కాసేపటి క్రితమే విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్కకు భద్రత కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. బర్రెలక్క నిర్వహించే పబ్లిక్ మీటింగ్లకు భద్రత కల్పించాలని పేర్కొంది.
2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తరఫున గెలిచి కారెక్కిన ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడానికి గులాబీ బాస్, సీఎం కేసీఆర్ సిద్ధంగా లేరా..? ఒకే ఒక్క ఎమ్మెల్యే తప్ప మిగిలిన ఏ ఒక్కరికీ కారులో చోటు లేదా..? ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన 10 మంది సిట్టింగ్లకు ఇవ్వనని తేల్చి చెప్పేసిన కేసీఆర్.. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు హ్యాండిచ్చేశారా..? ఈ ఎమ్మెల్యేల స్థానాల్లో కొన్నింటిలో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిన వారు..? మరికొన్ని కొత్త ముఖాలను బరిలోకి దించడానికి సన్నాహాలు చేస్తున్నారా..?..
నాగర్ కర్నూల్ జిల్లా: వచ్చే ఎన్నికల్లో పాలమూరు జిల్లా (Palamuru Dist.)లో 13 స్థానాల్లో బీఆర్ఎస్ (BRS) వ్యతిరేకులు గెలుస్తారని జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.