Minister Errabelli: ముత్యందార జలపాతంలో చిక్కుకున్న పర్యాటకుల పరిస్థితిపై ఆరా
ABN, First Publish Date - 2023-07-26T23:23:46+05:30
ములుగు జిల్లా వెంకటాపురం(Venkatapuram) మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని ముత్యందార జలపాతంలో (Mutyamdhara waterfalls) 84మంది పర్యాటకులు చిక్కుకున్నారు.
వరంగల్(Warangal): ములుగు జిల్లా వెంకటాపురం(Venkatapuram) మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని ముత్యందార జలపాతంలో (Mutyamdhara waterfalls) 84మంది పర్యాటకులు చిక్కుకున్నారు. కాగా అడవిలో చిక్కుకున్న పర్యాటకుల పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణ సహాయచర్యలు చేపట్టి, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పర్యాటకులంతా క్షేమంగానే ఉన్నారని బాధిత కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.
మంత్రి సత్యవతి రాథోడ్ స్పందన
అడవిలో చిక్కుకున్న పర్యాటకుల పరిస్థితిపై మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) స్పందించారు.జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసి పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు.వరద ధాటికి అడవిలో చిక్కుకున్న పర్యాటకులను గ్రామానికి చేర్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు సంఘటన స్థలానికి చేరుకోవడానికి చర్యలు చేపట్టారు.ఎప్పటికప్పుడు ఘటనపై సమీక్షిస్తూ అధికారులను మంత్రి సత్యవతి రాథోడ్ అప్రమత్తం చేస్తున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని పర్యాటకులు సురక్షితంగానే ఉన్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
Updated Date - 2023-07-27T04:18:56+05:30 IST