ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harish Rao: ముత్తిరెడ్డి నిండు మనసుతో పల్లాను ఆశీర్వదించారు

ABN, First Publish Date - 2023-10-11T16:22:26+05:30

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నిండు మనసుతో పల్లా రాజేశ్వర్రెడ్డిని ఆశీర్వదించారని.. జనగామ బరువు, బాధ్యతలు పల్లాకు అప్పగించారని మంత్రి హరీష్ రావు అన్నారు.

జనగామ: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (MLA Muthireddy Yadagiri Reddy) నిండు మనసుతో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని (Palla Rajeshwar Reddy) ఆశీర్వదించారని.. జనగామ బరువు, బాధ్యతలు పల్లాకు అప్పగించారని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు. బుధవారం జనగామ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అప్పగింతలు జరిగితే కన్నీరు పెడతారు... కానీ యాదగిరిరెడ్డి నిండు మనసుతో దీవించారని, స్వీట్ కూడా తినిపించారన్నరు. రాజకీయాల్లో ఇలాంటి సందర్భం అరుదుగా ఉంటుందన్నారు. టికెట్ మార్చినా గొడవలు లేకుండా అప్పగింతలు చేశారన్నారు. తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ (BRS), కేసీఆర్ (KCR) అంటే ఇది అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ వాళ్లు టికెట్లు రాకముందే కొట్లాడుకుంటున్నారని.. కాంగ్రెస్ (Congress) అంటే గ్రూపులు, మూటలు, ముఠాలు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలన అంటే కరువులు, కరెంటు కోతలు అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కైలాసంలో పెద్దపాము మింగినట్టే అవుతుందని తెలిపారు ఎల్లుండి ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు లక్ష మందిని తీసుకురావాలని కార్యకర్తలకు హరీష్ రావు ఆదేశించారు.

Updated Date - 2023-10-11T16:22:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising