Satyavathi Rathod: వరదల్లో 16 మందిని కోల్పోవడం బాధాకరం...
ABN, First Publish Date - 2023-07-30T12:15:55+05:30
ములుగు జిల్లా: వరద సహాయక చర్యల్లో పోలీసుల సేవలు అభినందనీయమని, వరదల్లో 16 మందిని కోల్పోవడం బాధాకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ములుగులో మీడియాతో మాట్లాడుతూ ...
ములుగు జిల్లా: వరద సహాయక చర్యల్లో పోలీసుల సేవలు అభినందనీయమని, వరదల్లో 16 మందిని కోల్పోవడం బాధాకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ములుగులో మీడియాతో మాట్లాడుతూ దయ్యాలవాగు, జంపన్న వాగు విషాదాన్ని మిగిల్చాయని, ముత్యందార పర్యాటక కేంద్రం వద్ద పోలీసులు అప్రమత్తంతో పర్యాటకులను సురక్షితంగా రక్షించగలిగారని అన్నారు. 5,400 వరద బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 10 రోజులకు సరిపడా నిత్యవసర సామాగ్రి అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
దెబ్బతిన్న జాతీయ రహదారుల మరమ్మతులు పూర్తి చేశామని, భారత దేశంలోనే రికార్డు స్థాయిలో ములుగులో వర్షపాతం నమోదయిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 805 చెరువులు అలుగు పోశాయని, 75 చెరువుల కట్టలు తెగాయని, వరదల్లో 16 మంది గల్లంతు కాగా...13 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని, ఇంకా ముగ్గురి ఆచూకీ దొరకలేదని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
Updated Date - 2023-07-30T12:15:55+05:30 IST