ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mutyandara Falls: చిక్కుకున్న పర్యాటకులు సేఫ్

ABN, First Publish Date - 2023-07-27T04:50:53+05:30

వెంకటాపురం మండలం వీరభద్రవరం అడవుల్లో చిక్కుకున్న 83మంది పర్యాటకులు సురక్షితంగా బయటకు వచ్చేశారు.

ములుగు(Mulugu): వెంకటాపురం మండలం వీరభద్రవరం అడవుల్లో చిక్కుకున్న 83మంది పర్యాటకులు సురక్షితంగా బయటకు వచ్చేశారు. ముత్యందార జలపాతం( Mutyandara Falls) చూడడానికి వెళ్లి పర్యాటకులు అటవీ మార్గంలో చిక్కుకున్నారు. పర్యాటకులు వస్తున్న క్రమంలో మధ్యలో వాగు పొంగడంతో తిరిగిరాలేక పర్యాటకులు అక్కడే ఉండిపోయారు. 8 గంటల తర్వాత పర్యాటకులు క్షేమంగా రావడంతో అధికారులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. 8 గంటల ఉత్కంఠకు తెరపడింది. మొదటగా వారి ఆచూకీ కోసం NDRF బృందం, రెవెన్యూ, ఫారెస్టు అధికారులు చర్యలు చేపట్టారు. వీరభద్రవరం రూట్ కాకుండా వేరే మార్గంలో పర్యాటకులు అంకన్నగూడెం చేరుకున్నారు. పర్యాటకులను కలెక్టర్ ఐలా త్రిపాఠీ, ఎస్పీ గౌస్ ఆలం రిసీవ్ చేసుకుని క్షేమంగా ఇళ్లకు పంపించారు.

Updated Date - 2023-07-27T04:50:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising