ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YS Sharmila: ఆరు నెలల్లోనే పోడు పట్టాలు ఇస్తానన్న సన్నాసి ఎవడు?

ABN, First Publish Date - 2023-02-11T11:59:10+05:30

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఆదివాసీలకు అవమానం జరిగిందని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) వేదికగా ఆదివాసీలకు అవమానం జరిగిందని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP YS Sharmila) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... గిరిజనులను సీఎం కేసీఆర్ (CM KCR) కబ్జాకోరులు, దురాక్రమణదారులు అని ఎలా అంటారని ప్రశ్నించారు. ‘‘ఎన్నికల కోసం 6 నెలల్లోనే పోడు పట్టాలు అని హామీ ఇచ్చిన సన్నాసి ఎవడు..?’’ అంటూ విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం ఆదివాసీల హక్కు అంటారని.. ఇప్పుడు ప్రభుత్వం (Telangana Government) దయ తలచాలి అని అంటారా అంటూ వైఎస్సార్టీపీ అధినేత్రి ప్రశ్నించారు.

2018 ఎన్నికల్లో కుర్చీ వేసుకొని కూర్చోని పోడు రైతులకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని.. 2019 అసెంబ్లీలో ఆదివాసీ బిడ్డలకు పోడు భూములకు హక్కు ఉందని చెప్పారని గుర్తుచేశారు. అడవి బిడ్డల జన్మ హక్కు అని అన్నారన్నారు. 6 నెలల్లో ఇస్తామని 4 ఏళ్లు దాటినా పట్టాలు ఇవ్వలేదని మండిపడ్డారు. పట్టాలు ఇవ్వక పోగా లక్షల ఎకరాల్లో ట్రెంచ్‌లు వేశారని.. మొక్కలు నాటారని... గిరిజన బిడ్డలను అరిగొస పెట్టారని అన్నారు. వేల మంది మీద కేసులు పెట్టారని...లాఠీ ఛార్జ్‌లు కూడా చేశారని మండిపడ్డారు. కేసీఆర్ (Telangana CM) అసెంబ్లీలో అడవి బిడ్డల గురించి నీచంగా మాట్లాడారని, గిరిజనులను కించపరిచారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-02-11T12:41:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising