TS Elections: ఓటర్ ఐడీకార్డు లేదా.. అయితే వీటిలో ఏదైనా తీసుకెళ్లండి...
ABN, First Publish Date - 2023-11-28T12:25:44+05:30
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో కీలక ఘట్టమైన ఓటింగ్ ప్రక్రియకు సమయం ఆసన్నమవుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ మొదలవనుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో కీలక ఘట్టమైన ఓటింగ్ ప్రక్రియకు సమయం ఆసన్నమవుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ మొదలవనుంది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కోలాహలం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ స్లిప్పుల పంపిణీ కొనసాగుతోంది. ఓటర్ స్లిప్పుతోపాటు ఓటరు గుర్తింపు కార్డ్ తీసుకెళ్లి ఓటర్లు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అయితే కారణాలు ఏమైనా కొంతమంది వద్ద ఓటరు ఐడీ కార్డులు లేకపోవచ్చు. అలాంటి వారు కూడా నిస్సందేహంగా ఓటు వేయవచ్చు. అయితే పోలింగ్ బూత్‌కు ప్రభుత్వ ఆమోదం ఉన్న 14గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి దానిని పోలింగ్ బూత్‌కి తీసుకెళ్తే సరిపోతోంది. ఆ కార్డులు ఏంటో మీరూ ఒక లుక్కేయండి..
1.ఓటరు గుర్తింపు కార్డు
2. ఆధార్ కార్డు
3.ఎంఎన్‌ఆర్‌జీఏ జాబ్‌కార్డు
4. పోస్టాఫీస్
5. బ్యాంక్ జారీ చేసిన ఫొటోతో ఉన్న పాస్‌బుక్
6. కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
7. డ్రైవింగ్ లైసెన్స్
8. పాన్‌కార్డు
9. ఆర్‌బీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు
10. ఇండియన్ పాస్‌పోర్టు
11. ఫొటోతో కూడిన పింఛన్ మంజూరు డాక్యుమెంట్,
12. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కార్డు
13. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం
14. దివ్యాంగుల ఐడెంటిటీ కార్డు.
Updated Date - 2023-11-28T12:47:16+05:30 IST