Y Plus security: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు నేటి నుంచి వై ప్లస్ భద్రత
ABN, First Publish Date - 2023-07-13T18:36:03+05:30
హుజూరాబాద్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు (BJP MLA Etala Rajender) వై ప్లస్ భద్రతను (Y Plus security) ప్రభుత్వం కల్పించింది.
హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు (BJP MLA Etala Rajender) వై ప్లస్ భద్రతను (Y Plus security) ప్రభుత్వం కల్పించింది. షామీర్‌పేట్‌లో ఉన్న ఈటల రాజేందర్ ఇంటికి సీఆర్పీఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. నేటి నుంచి వై ప్లస్ కేటగిరి భద్రత మధ్య ఈటల రాజేందర్ పర్యటనలు చేయనున్నారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు వై కేటగిరి కేంద్ర భద్రత కల్పించారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది విధుల్లోకి చేరారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ప్రభుత్వం భద్రతను పెంచిన విషయం తెలిసిందే. పోలీసు ఉన్నతాధికారుల నుంచి అందిన నివేదిక మేరకు ఈటలకు వై ప్లస్ భద్రత కల్పించింది. ఇప్పటి వరకు ఈటలకు 2 ప్లస్ 2 భద్రత ఉండేది. వై ప్లస్ భద్రత నేపథ్యంలో ఇకపై మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటారు. ప్రతి షిఫ్ట్‌లో ఇద్దరు చొప్పున పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్(పీఎస్ఓ)లు రోజుకు మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటారు. మరో ఐదుగురు గార్డులు ఈటల ఇల్లు, కార్యాలయం వద్ద భద్రతా విధుల్లో ఉంటారు. తనకు ప్రాణహాని ఉందని, గుర్తు తెలియని వ్యక్తులు తన ఇల్లు, కార్యాలయం పరిసరాల్లో తిరుగుతున్నారంటూ ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు. ఈటలకు తగిన భద్రత కల్పిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అనంతరం ఈటల భద్రతపై మేడ్చల్ డీసీపీ సందీప్ డీజీపీకి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక మేరకు ఈటలకు వై ప్లస్ భద్రత కల్పించారు.
Updated Date - 2023-07-13T18:36:17+05:30 IST