Yadadri Naresh Swati Case : నరేష్, స్వాతి పరువు హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..
ABN, First Publish Date - 2023-01-18T19:39:36+05:30
2017లో కులాంతర వివాహం చేసుకున్న స్వాతి, నరేష్ ప్రేమ కథ విషాదంగా ముగిసిన విషయం తెలిసిందే. స్వాతి, నరేష్‌ల కేసు మొదటి నుంచి రోజుకో మలుపు తిరిగింది. తన కూతురు..
యాదాద్రి : 2017లో సంచలనం సృష్టించిన నరేష్, స్వాతిల పరువు హత్య కేసులో భువనగిరి జిల్లా సెషన్స్ కోర్ట్ తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్టు యాదాద్రి భువనగిరి జిల్లా జడ్జి బాల భాస్కర్ తీర్పు ఇచ్చారు. నరేష్, స్వాతి మృతికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో 2017లో కులాంతర వివాహం చేసుకున్న స్వాతి, నరేష్ ప్రేమ కథ విషాదంగా ముగిసిన విషయం తెలిసిందే. స్వాతి, నరేష్‌ల కేసు మొదటి నుంచి రోజుకో మలుపు తిరిగింది. తన కూతురు స్వాతిని వివాహం చేసుకుని పరువు తీశాడన్న కక్షతో ఆమె తండ్రి శ్రీనివాసరెడ్డే నరేష్‌ను హత్య చేసినట్లు అప్పట్లో పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. యాదాద్రికి పరిధి ఆత్మకూరు మండలం పల్లెర్లకు చెందిన నరేష్, అదే మండల పరిధిలోని లింగరాజుపల్లికి చెందిన స్వాతి చదువుకుంటున్న సమయంలో ప్రేమించుకున్నారు.
వామ్మో.. ఈ కేసులో ఎన్ని ట్విస్టులో.. చనిపోయాడనుకున్న 18 ఏళ్ల ఈ కుర్రాడు ఎలా తిరిగొచ్చాడంటే..!
2017 మార్చి 23న ఇద్దరూ ముంబైలో ఉంటున్న నరేష్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. అనంతరం అక్కడే ప్రేమ వివాహం (love marriage) చేసుకున్నారు. తర్వాత స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేయడంతో ఆత్మకూరు పోలీసులు మార్చి 27న వారిద్దరినీ సొంతూరికి పిలిపించారు. తర్వాత ఇద్దరూ విడివిడిగా ఉండేవారు. అయితే ఉప్పల్‌లోని అక్క ఇంట్లో ఉన్న స్వాతి అదే నెల 31న తిరిగి నరేష్ వద్దకు వెళ్లింది. స్వాతిని ఇంట్లోకి రానిచ్చేందుకు నరేష్ కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఇద్దరూ ముంబైలోనే వేరే కాపురం పెట్టారు.
ఈ క్రమంలో వివాహం చేస్తానంటూ శ్రీనివాస రెడ్డి.. వారిద్దరినీ ఇక్కడికి పిలిపించాడు. మే 1న స్వాతిని తనతో ఇంటికి తీసుకెళ్లాడు. అయితే అదే రోజు నుంచి నరేష్ అదృశ్యమయ్యాడు. జాడ మాత్రం ఆరోజు నుంచి తెలియరాలేదు. ఇలావుండగా, మే 16న స్వాతి ఆత్మహత్యకు (suicide) పాల్పడింది. నరేష్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చివరకు శ్రీనివాస్ రెడ్డే నరేష్‌ను హత్య చేసినట్లు గుర్తించారు. ఈ కేసును కొట్టివేస్తూ తాజాగా కోర్టు తీర్పు ఇవ్వడం స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.
Updated Date - 2023-01-20T23:18:44+05:30 IST