ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వివేకా పీఏ కృష్ణారెడ్డి కేసులో సాక్షుల విచారణ పూర్తి

ABN, Publish Date - Dec 21 , 2024 | 04:32 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పీఏ వెంకటకృష్ణారెడ్డి ప్రైవేట్‌ కేసుకు సంబంధించి 39మంది సాక్షులను పోలీసులు విచారించారు.

పులివెందుల, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పీఏ వెంకటకృష్ణారెడ్డి ప్రైవేట్‌ కేసుకు సంబంధించి 39మంది సాక్షులను పోలీసులు విచారించారు. దీంతో ఈ విచారణ ప్రక్రియ పూర్తయింది. మాజీ సీఎం జగన్‌ బంధువు, పులివెందుల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వేంపల్లె జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డిలను పులివెందుల డీఎస్పీ మురళినాయక్‌ ఆధ్వర్యంలో శుక్రవారం విచారించారు. మరోసాక్షి వైఎస్‌ అభిషేక్‌రెడ్డి అనారోగ్య కారణాలతో విచారణకు హాజరుకాలేదు. ఇక, సీబీఐ అధికారులకు నోటీసులిచ్చిన వారిని కూడా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. 2019లో వివేకానందరెడ్డి హత్యకేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి వివేకా పీఏ వెంకటకృష్ణారెడ్డి.. తనను తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరించారంటూ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, అప్పటి సీబీఐ విచారణాధికారి రామ్‌సింగ్‌పై పులివెందుల కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సాక్షులను విచారించి చార్జిషీటు వేయాలని పులివెందుల పోలీసులను కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు 39 మంది సాక్షులను విచారించారు.

Updated Date - Dec 21 , 2024 | 04:32 AM