ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరద బాధితులకు యూబీఐ ఉద్యోగుల విరాళం 5.9 కోట్లు

ABN, Publish Date - Oct 01 , 2024 | 04:38 AM

వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు తమ పెద్ద మనసుతో ముందుకు వస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ మొత్తాల్లో విరాళాలను అందిస్తున్నారు.

  • సిద్ధార్థ అకాడమీ కోటి, ఆర్జా స్టీల్స్‌ కోటి విరాళం

  • సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను కలసి చెక్కులు అందజేసిన పలువురు దాతలు

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు తమ పెద్ద మనసుతో ముందుకు వస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ మొత్తాల్లో విరాళాలను అందిస్తున్నారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలసి చెక్కుల రూపంలో తమ విరాళాలను అందజేశారు. దాతలను సీఎం చంద్రబాబు అభినందించారు. యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఉద్యోగులందరూ ఒక రోజు వేతనం సొమ్ము రూ.5,90,01,087లు అందజేశారు. ఉద్యోగుల తరఫున యూనియన్‌ బ్యాంకు ఎండీ, సీఈవో ఎ.మనిమేఖలై సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుని రాష్ట్ర సచివాలయంలో కలసి చెక్కు అందజేశారు.

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌.రామసుబ్రహ్మణియన్‌, జనరల్‌ మేనేజరు, ఎస్‌ఎల్‌బీసీ రాష్ట్ర కన్వీనర్‌ సీవీఎన్‌ భాస్కరరావు తదితర ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఇంకా పలువురు దాతలు సీఎంను కలిసి తమ విరాళాలను అందించారు. సిద్ధార్థ అకాడమీ ఆఫ్‌ జనరల్‌ అండ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ సి.నాగేశ్వరరావు, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.రాజయ్య, కార్యదర్శి పి.లక్ష్మణరావు రూ.1 కోటి 1,116ల చెక్కును సీఎంకు అందజేశారు. ఆర్జా స్టీల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ శ్రీధర్‌ కృష్ణమూర్తి రూ.కోటి, ఆర్‌.ఆదికేశవుల నాయుడు రూ.10 లక్షలు, అసోసియేషన్‌ ఆఫ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఇండియా రూ.10 లక్షలు, శ్రీ విజయ ఎడ్యుకేషనల్‌ సొసైటీ రూ.10 లక్షలు, ముక్కామల అప్పారావు రూ.10 లక్షలు, చిన్మయి ఆర్గనైజేషన్‌ ఫర్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ రూ.10 లక్షలు, తెలుగు విజ్ఞాన సమితి రూ.5 లక్షలు, జయశ్రీ పాలిమర్స్‌ రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అచ్చెన్నపాలానికి చెందిన పాతూరి కేతన్‌ చౌదరి తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.10 వేలు అందజేశాడు.


  • మంత్రి లోకేశ్‌కు విరాళాలు అందజేసిన దాతలు

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను పలువురు దాతలు ఉండవల్లిలోని నివాసంలో కలిసి తమ విరాళాలను అందజేశారు. కేరళకు చెందిన పెన్వర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఫిలిప్స్‌ థామస్‌ రూ.50 లక్షలు, విజయవాడకు చెందిన ఇండిపెండెంట్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు రూ.50 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శశి ఎడ్యుకేషనల్‌ సొసైటీ అధ్యక్షుడు బి.వేణుగోపాలకృష్ణ రూ.25 లక్షలు, అనంతపురానికి చెందిన కేఎం షకీల్‌ సఫీ నేతృత్వంలో ఏపీ వక్ఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌, ముతవల్లీస్‌ అండ్‌ మేనేజింగ్‌ కమిటీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు రూ.7.86 లక్షలు, గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, నాయకులు కలిపి రూ.3.36 లక్షలు, పిడపర్తిపాలెం గ్రామానికి చెందిన అరుణోదయ మహిళా గ్రూప్‌ రూ.1.21 లక్షలు, మచిలీపట్నానికి చెందిన ఎం ధనలక్ష్మి రూ.లక్ష అందజేశారు.

Updated Date - Oct 01 , 2024 | 04:38 AM