ప్రపంచ దేశాలకు అరకు కాఫీ!
ABN, Publish Date - Nov 19 , 2024 | 05:43 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ప్రకారం అరకు కాఫీని ప్రపంచ దేశాలకు పౄరిౄచయం చేస్తామని గిరిజన సహకార సంస్థ(జీసీసీ) చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ చెప్పారు.
జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ వెల్లడి
విశాఖపట్నం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ప్రకారం అరకు కాఫీని ప్రపంచ దేశాలకు పౄరిౄచయం చేస్తామని గిరిజన సహకార సంస్థ(జీసీసీ) చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ చెప్పారు. సోమవారం విశాఖపట్నంలోని జీసీసీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలోని అన్ని నగరాల్లో అరకు కాఫీని అందుబాటులో ఉంచుతామన్నారు. గిరిజన రైతులకు, జీసీసీకి మధ్య దళారులు లేకుండా చూస్తామని, గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. జీసీసీ ఎండీ కల్పనాకుమారి మాట్లాడుతూ అరకు కాఫీ పొడితో పాటు లిక్విడ్ కాఫీ కూడా అందిస్తామని, కాఫీపై ఐటీ రాయితీ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, బాకూరు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 19 , 2024 | 05:43 AM