హామీలకు కేటాయింపులేవీ?: ఎమ్మెల్సీ కల్యాణి
ABN, Publish Date - Nov 12 , 2024 | 05:16 AM
కూటమి నేతలు ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగలేదని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. ‘ఏడు నెలలుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో నడిపి, ఇప్పుడు
అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): కూటమి నేతలు ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగలేదని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. ‘ఏడు నెలలుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో నడిపి, ఇప్పుడు ఫుల్ బడ్జెట్ అంటున్నారు. రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. దానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. అమ్మ ఒడిని కాపీ కొట్టి, ఇద్దరు పిల్లలకు డబ్బులిస్తామని, ఏమీ ఇవ్వలేదు. 18ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని ఐదు నెలలైనా పథకాన్నే ప్రారంభించలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని పైసా ఇవ్వలేదు. 20 లక్షల ఉద్యోగాలని కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని విమర్శించారు.
Updated Date - Nov 12 , 2024 | 05:16 AM