Share News

అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు

ABN , Publish Date - May 23 , 2024 | 11:20 PM

: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1998-99 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తన స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచారు.

అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు
స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం అంద‌జేస్తున్న పూర్వ‌విద్యార్థులు

స్నేహితునికి కుటుంబానికి రూ.56వేల ఆర్థిక సాయం

మద్దికెర, మే 23: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1998-99 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తన స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచారు. స్థానిక గిడ్డయ్య వీధిలో నివాసముంటున్న స్నేహితుడు షేక్షావలి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న పూర్వ విద్యార్థులు రూ.56వేలను సమీకరించి ఆయన కుటుంబానికి గురువారం అందజేశారు. భవిష్యత్తులో స్నేహితుడి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. మిత్రులందరూ విరాళం ఇచ్చినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - May 23 , 2024 | 11:20 PM