ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : ప్రజాదర్బార్‌కు బాధితుల క్యూ

ABN, Publish Date - Sep 20 , 2024 | 05:39 AM

వైసీపీ నేతల బెదిరింపులు, భూ కబ్జాలు, అధికారుల అలసత్వంపై బాధితులు ప్రభుత్వ పెద్దలకు ఏకరవు పెట్టారు.

  • టీడీపీ ఆఫీ్‌సలో వినతులు స్వీకరించిన మంత్రి గొట్టిపాటి, టీడీపీ నేతలు

అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతల బెదిరింపులు, భూ కబ్జాలు, అధికారుల అలసత్వంపై బాధితులు ప్రభుత్వ పెద్దలకు ఏకరవు పెట్టారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్‌కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వినతులతో వచ్చిన బాధితులు క్యూ కట్టారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తన కుమార్తె వైద్య చికిత్సకు సాయం చేయాలని తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన బీ రంజిత్‌ కోరగా, మంత్రి రవికుమార్‌ రూ.20 వేలు సాయం చేశారు.

తమకు వారసత్వంగా వచ్చిన 4 సెంట్ల స్థలాన్ని కబ్జా చేసి, సెటిల్‌మెంట్‌కు రమ్మంటున్నాడని నంద్యాలకు చెందిన రమాదేవి మంత్రికి ఫిర్యాదు చేశారు. కబ్జాకు గురైన తమ భూమిని కోర్టు చెప్పినా.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఏలూరు జిల్లా ఆముదాలపల్లికి చెందిన అట్లూరి వేణుగోపాల్‌, భాస్కర్‌ ఫిర్యాదు చేశారు. తన ఎక్స్‌కవేటర్‌ను వైసీపీకి చెందిన జీ కొండూరు ఎంపీపీకి అద్దెకిస్తే.. రెండేళ్ల నుంచి అద్దె ఇవ్వకుండా కులం పేరుతో దూషిస్తున్నారని ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లికి చెందిన తలారి రంగారావు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో ఐటీఐ అర్హతతో విద్యుత్‌ శాఖలో షిఫ్ట్‌ ఆపరేటర్లుగా నియమించబడిన వారికి స్కిల్‌ వర్కర్లకు ఇస్తున్న వేతనం కాకుండా అంత కంటే తక్కువ ఇస్తున్నారని యునైటెడ్‌ ఎలక్ర్టిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 2018 డీఎస్సీలో క్రీడా కోటాలో పీఈటీ పోస్టుకు మెరిట్‌ లిస్టులో మొదటి స్థానంలో ఉన్న తనను ఆపి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురే్‌షకుమార్‌ బంధుప్రీతితో మరొకరిని నియమించారని అనంతపురం జిల్లా కూరాకులపల్లికి చెందిన గాజుల పుష్పావతి ఫిర్యాదు చేశారు. బాధితుల వినతులను అధికారులతో చర్చించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి రవికుమార్‌ చెప్పారు.

Updated Date - Sep 20 , 2024 | 05:39 AM